ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటాకేనాయుడు మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సందీప్ కిషన్ 10 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఇప్పటివరకు ఒక్క సాలిడ్ హిట్ కొట్టలేకపోయాడు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తరువాత ఈహీరోకు ఎన్ని ప్రయత్నాలు చేసినా హిట్ లేదు. ఇలాంటి పరిస్థితులలో ఈహీరో లేటెస్ట్ గా విడుదల కాబోతున్న ‘భైరవకోన’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు.


‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి డిఫరెంట్ మూవీ తీసిన దర్శకుడు ఆనంద్ తో ఈమూవీని చేస్తున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీ టీజర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ పై అంచనాలు పెరిగాయి. ఈ టీజర్ మేకింగ్ కూడ చాల ఆశక్తిదాయకంగా ఉంది. ‘గరుడపురాణంలో’ మాయమైన నాలుగు పేజీల ఆధారంగా భైరవకోన అనే ఊరిలో తలెత్తిన విపరీత పరిణామాలు నేపథ్యంలో ఈకథ ఉంటుంది. ఈ ఊరులోకి లోపలి వెళ్లడమే కానీ ఎవరు బయటికి రాలేరు దీనివెనుక ఒక రహస్యం ఉంది.


ఇలాంటి మిస్టరీ సినిమాలను నేటితరం ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈమధ్యనే  రిలీజ్ అయి ఘన విజయం సాధించిన ‘విరూపాక్ష’ పోలికలు ఈమూవీలో కనిపిస్తున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ సస్పెన్స్ సినిమాలు అక్కడ జరిగే హత్యలు ఇలాంటి అంశాలతో కూడిన సినిమాలను నేటితరం ప్రేక్షకులు బాగా చూస్తున్నారు. ఈసినిమాను వచ్చేనెల ప్రభాస్ ‘ఆదిపురుష్’ హంగామా పూర్తి అయిన తరువాత జూలై నెలలో విడుదల చేస్తారని లీకులు వస్తున్నాయి.


డిఫరెంట్ కథలతో డిఫరెంట్ సినిమాలను తీయగల దర్శకుడు ఆనంద్ ఆమధ్యన సినిమాలు అన్నీ పరాజయం చెందాయి. ప్రస్తుతం సందీప్ కిషన్ సినిమాలకు కనీసపు ఓపెనింగ్ కలక్షన్స్ కూడ రావడంలేదు. ఇలాంటి పరిస్థితులలో వీరిద్దరికీ ఇండస్ట్రీలో నిలబడాలి అంటే ఒకహిట్ కావాలి. ఆలోటును ‘భైరవకోన’ ఎంతవరకు తీరుస్తుంది అన్నవిషయం ప్రస్తుతానికి సస్పెన్స్. సమ్మర్ రేస్ పూర్తి అయిన తరువాత జూలై నెలాఖరు వరకు ఎక్కువగా చిన్న సినిమాలు వస్తాయి. ఈ అవకాశాన్ని ఈసినిమా ఎంతవరకు సద్వినియోగ పరుచుకుంటుందో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి: