చాయ్ బిస్కెట్ నిర్మాణ సంస్థ తాజాగా మేము ఫేమస్ అనే సినిమాను నిర్మించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సుమత్ ప్రభాస్ హీరో గా నటించాడు. ఈ మూవీ లో సుమంత్ ప్రభాస్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి రైటర్ కం డైరెక్టర్ గా కూడా వర్క్ చేశాడు. ఈ మూవీ ని మే 26 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. 

ఇప్పటి వరకు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులకు ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇలా మంచి అంచనాలు ఏర్పడ్డ ఈ మూవీ యొక్క డిస్ట్రిబ్యూషన్ హక్కులను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన ఒక సంస్థ దక్కించుకుంది. తాజాగా ఈ విషయాన్ని కూడా ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మూవీ యొక్క డిస్ట్రిబ్యూషన్ హక్కులను గీత ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా అల్లు అరవింద్ దక్కించుకున్నారు. తాజాగా ఈ విషయాన్ని గీత ఆర్ట్స్ సంస్థ కూడా అధికారికంగా ధ్రువీకరించింది. గీతా ఆర్ట్స్ సంస్థ చేతుల్లోకి ఈ సినిమా చేరిన కారణంగా ఈ మూవీ.కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ రిలీజ్ లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఉంటుందో అందుకుంటుందో తెలియాలి అంటే మే 26 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: