తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగార్జున ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల్లో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నాగార్జున కెరియర్ ప్రారంభం దశలో శివ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ తో అప్పటి వరకు లేని ఒక కొత్త ట్రెండ్ ను కూడా నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీ లో సృష్టించాడు.

మూవీ తో నాగర్జున క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఈ మూవీ కి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రముఖ నిర్మాత అయినటు వంటి శ్రీనివాస చిట్టూరి ... నాగార్జున కు శివ మూవీ ఎలాగో ... నాగ చైతన్య కు కస్టడీ మూవీ అలాగే అని వ్యాఖ్యానించాడు. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా నాగ చైతన్య ... వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ఇళయ రాజా ... యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు.  ప్రియమణి , అరవింద స్వామి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ ని మే 12 వ తేదీన తెలుగు ... తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. తాజాగా ఈ మూవీ గురించి శ్రీనివాస చిట్టూరి మాట్లాడుతూ ... నాగార్జున గారి కెరీర్ లో శివ మూవీ ఎలాగో ... నాగ చైతన్య కెరియర్ లో కస్టడీ మూవీ అలాగే అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: