నేచురల్ స్టార్ నాని దసరా సినిమా హిట్ తర్వాత తన నెక్స్ట్ సినిమాల విషయంలో పక్కా ప్లానింగ్ తో వున్నాడు. తనును  అందరూ క్లాస్ హీరోనే అని అంటూ విమర్శించే వారికి తనలో ఉన్న మాస్ యాంగిల్ ని చూపించే షాక్ ఇస్తున్నాడ్డు నాని. దసరా సినిమా విషయంలో నాని చేసిన రిస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ సినిమా అవుట్ పుట్ చూసి ఒక్కసారిగా సినీ ప్రేక్షకులు అందరూ షాక్ అయ్యారు. ఫైనల్ గా ఆ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనం చూసాం. ఇక దసరా సినిమా ఎలా రిలీజ్ అయిందో లేదో నాని తన సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లాడు.

 శౌర్యవ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాని కి జోడిగా మృనాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తోంది.ఈ సినిమాతో పాటు శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3  చేయబోతున్నాడు.ఇక త్వరలోనే నాని హిట్ సినిమా మొదలు పెట్టబోతున్నాడు. ఇంతలోగానే నాని మరో సినిమా కూడా చేయాలన్న ప్లాన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఈయన దర్శకత్వంలో నాని అంటే సుందరానికి సినిమా చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇక మళ్లీ ఇప్పుడు ఆ డైరెక్టర్ తో మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట నాని.ఇంకా ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది .

అంతే కాదు రెండు నెలల గ్యాప్ కూడా లేకుండా వేసవి కానుకగా ఆ సినిమాని రిలీజ్ చేయబోతున్నారట .ఈ క్రమంలోనే హిట్ త్రీ వచ్చే సంవత్సరం రాబోతుంది. దీంతో హిట్ సినిమా కంటే ముందే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఒక సినిమా చేయబోతున్నాడు. ఈసారి ఈయన దర్శకత్వంలో వచ్చే ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకంతో ఉన్నాడు నాని. ప్రస్తుతం నాని 30 వివేక్ ఆత్రేయ సినిమాతో పాటు హిట్ త్రి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇకపోతే నాని నటించిన జెర్సీ సినిమా తర్వాత ఈ సినిమాలో కూడా నాని ఫాదర్ రోల్లో కనిపించబోతున్నట్లుగా సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: