నాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఫిదా సినిమా తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తెలుగు తెలియకపోయినప్పటికీ తెలంగాణ భాషలో మాట్లాడి అందరిని ఫిదా చేసింది. ఫిదా సినిమా తర్వాత ఈమెకి వరుస అవకాశాలు వచ్చాయి. మంచి క్రేజ్ ఉంది కదా అని ఇష్టం వచ్చిన సినిమాలు సాయి పల్లవి అస్సలు చెయ్యదు. వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకొని నటిస్తోంది. ఈమె నటించిన సినిమాలన్నీ చాలావరకు మంచి హిట్ లుగా నిలిచాయి. చాలా సినిమాలు అవార్డులను సైతం సొంతం చేసుకున్నాయి. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె గ్లామర్ పాత్రలకు దూరంగా 

సహజసిద్ధమైన నటనకు ఆస్కారం ఉన్న పాత్రలోనే నటిస్తూ ఉంటుంది. ఎంత నటి అయినప్పటికీ తనదైన మార్కును ఇండస్ట్రీలో సెట్ చేసింది సాయి పల్లవి. ఇక అలాంటి ఒక స్టార్ హీరోయిన్ కి తొలిప్రేమ కూడా ఉందట .సాయి పల్లవి ఏడవ తరగతి లోనే ఒక అబ్బాయిని ప్రేమించినట్లుగా ఇప్పుడు తెలుస్తోంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఆ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ గురించి వెల్లడించింది సాయి పల్లవి. అయితే సాయి పల్లవి డాక్టర్ కాబోయే యాక్టర్ అయింది అంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఆమె మంచి డాన్సర్ కూడా.. అప్పట్లో బుల్లితెరపై ప్రసారమయ్యే అనేక డాన్సర్ లో పాల్గొని డాన్సర్ గా కూడా సత్తా చాటుకుంది.

చిన్న వయసులోనే అన్ని కళ్ళల్లో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించుకుంది ఆమె.అయితే ఈ మధ్యనే ఆమె డైరెక్టర్ భారతి రాజా ప్రేమలో పడని వారు కళాకారులే కాలేరు అంటూ చెప్పింది. ఇక అలాంటి ఒక మంచి అనుభవం ఆమె జీవితంలో కూడా ఉందంటూ చెప్పింది. ఈ విషయాన్ని స్వయంగా సాయిపల్లవి ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. నా స్కూల్ డేస్ లోనే నేను ఒక అబ్బాయిని తొలిచూపులోనే ప్రేమించాను.. ఏడవ తరగతి లోనే నాతోటి విద్యార్థిని ఇష్టపడ్డాను అంటూ వెల్లడించింది. అంతే కదా నా ఫస్ట్ డే నేను అతన్ని ఎంతో ప్రేమించాను.. నా లవ్ ను ఆ అబ్బాయికి చెప్పేందుకు లవ్ లెటర్ ను సైతం రాశాను.. కానీ ఆ లవ్ లెటర్ ఎలా ఇవ్వాలో తెలియక నా పుస్తకంలోనే దాచుకున్నాను.. అంటూ టాప్ సీక్రెట్ చేసింది. కొంతకాలానికి ఆ లెటర్ కాస్త మా అమ్మ కంట పడింది ఆ లెటర్ చదివి నన్ను బాగా కొట్టింది కూడా.. అంతేకాదు మా అమ్మ నన్ను కొట్టడం అదే మొదటిసారి.. అప్పటినుండి ఇప్పటివరకు మళ్లీ నేను అమ్మను బాధపెట్టిందే లేదు అంటూ చెప్ప చెల్లి సాయి పల్లవి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: