
అయితే సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అటు సోషల్ మీడియా వేదికగా కూడా అభిమానులను ఎప్పుడు పలకరిస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు తన హాట్ హాట్ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే సారా అలీ ఖాన్ ఇటీవల హట్కే జర బచ్కే జరా అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది ఈ హీరోయిన్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తన కెరియర్ గురించి మాత్రమే కాదు తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలనుఅభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే ఇటీవల జరిగిన సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో.. సారా అలీ ఖాన్ ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. తనతో నటించిన హీరోలు అందరికీ కూడా పెళ్లిళ్లు అయిపోతున్నాయని.. ఎవరైనా హీరో పెళ్లి కావాలని అనుకుంటే తనతో నటించాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు వరకు సారా అలీ ఖాన్ తో నటించిన రణవీర్ సింగ్, వరుణ్ ధావన్, విక్రాంత్ మెస్సేజ్ తో పాటు ఇప్పుడు తాజాగా నటించిన విక్కీ కౌశల్ కి కూడా పెళ్లి అయిపోయింది. దీంతో ఎవరైనా హీరో కి పెళ్లి కావాలనుకుంటే తనతో నటించాలని ఫన్నీ కామెంట్స్ చేసింది సారా అలీ ఖాన్.