ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా బిజీగా వున్న హీరోయిన్ ఎవరంటే ఖచ్చితంగా గుర్తొచ్చే పేరు శ్రీ లీల. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ హాట్ యంగ్ బ్యూటీ తన అందం ఇంకా నటనతో ఎంతో మంది యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది.ఇంకా అంతేకాకుండా ప్రస్తుతం నెబర్ వన్ స్థానానికి కూడా దూసుకుపోతుంది ఈ యంగ్ హీరోయిన్.పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హాట్ బ్యూటీ.. తన మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఇక తర్వాత వచ్చి ధమకా సినిమాలో కేవలం అందంతోనే కాకుండా డ్యాన్స్‌తో కూడా బాగా మెప్పించి ప్రస్తుతం వరస సినిమాలతో చాలా బిజీ అయిపోయింది.కన్నడలో రెండు ఇంకా తెలుగులో రెండు సినిమాలు చేసిన ఆమె కాల్ సీట్ల కోసం ఇప్పుడు తెలుగులో పెద్ద పెద్ద హీరోలు కూడా క్యూలో నుంచునే పరిస్థితి వచ్చిందట .


పూజా హెగ్డే, రష్మిక లాంటి హాట్ భామలను కూడా కాదని ఈమె కోసం ఎదురుచూస్తున్నారంటే ఈమె హవా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.ముఖ్యంగా టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, రామ్, వైష్ణవ్ తేజ్ ఇలా ఆమె సినిమాల లిస్టు చూస్తే అసలు ఇన్ని సినిమాలకు ఆమె డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.ఇదే జోరు కనుక శ్రీలీల కొనసాగిస్తే టాలీవుడ్ నెంబర్వన్ కిరీటం ఆమెదేనని నిరభ్యంతరంగా చెప్పవచ్చు. ఒకప్పుడు అనుష్క, కాజల్, సమంత లాగా శ్రీ లీల కూడా నెంబర్ 1 స్టార్ హీరోయిన్ స్టార్ డం ని ఎంజాయ్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ధమాకా సినిమాలో శ్రీ లీల వేసిన డాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. అదే ఇప్పుడు ఆమెకు వరుస అవకాశాలని తెచ్చుపెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: