
తెలుగులో అయితే యంగ్ హీరోతో సినిమా చేసిన డైరెక్టర్ కు అది కూడా సోసోగా టాక్ తెచ్చుకున్న సినిమా తీసిన డైరెక్టర్ కి స్టార్ హీరో ఛాన్స్ ఇవ్వడం అరుదు. ఇక అద్భుతమైన కథ లాక్ చేస్తే తప్ప అలాంటి కాంబో ఫిక్స్ అవదు. కానీ కోలీవుడ్ లో మాత్రం అలా కాదు స్టార్ ఇమేజ్ మీద కొన్ని సినిమాలు నడిచిపోతాయి. విజయ్ నటించిన వారిసు సినిమా తెలుగులో అయితే డిజాస్టర్ అయ్యేది. కానీ ఆ సినిమా ఎంత రొటీన్ గా అనిపించినా దాంతో కూడా విజయ్ కు సూపర్ హిట్ అందించారు ఫ్యాన్స్.
ఇక కస్టడీ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా వెంకట్ ప్రభుతో విజయ్ సినిమా ఓకే చేసుకున్నాడు. ఆల్రెడీ అంతకుముందు కోలీవుడ్ స్టార్స్ అజిత్, సూర్య, కార్తి, శింబు లను డైరెక్ట్ చేసిన వెంకట్ ప్రభు విజయ్ తో సినిమా ఓ రేంజ్ లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. సినిమా కోసం విజయ్ కి రెమ్యునరేషన్ గానే 200 కోట్ల దాకా ఇస్తున్నారని తెలుస్తుంది. మొత్తానికి విజయ్ 68 కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది. కస్టడీ టార్గెట్ మిస్ అయినా వెంకట్ ప్రభు టాలెంట్ ఏంటో దళపతి సినిమాతో ప్రూవ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.