నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో ఒకరు అయినటువంటి విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయినటువంటి బిచ్చగాడు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈ నటుడు ఎన్నో సినిమాలను తెలుగు లో విడుదల చేశాడు. కాకపోతే ఏ మూవీ కూడా బిచ్చగాడు రేంజ్ విజయాన్ని మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోలేదు.

ఇలా బిచ్చగాడు మూవీహీరో కు అద్భుతమైన గుర్తింపును అదిరిపోయే బ్లాక్ బాస్టర్ ను ఇచ్చిన నేపథ్యంలో ఈ హీరో బిచ్చగాడు 2 పేరుతో ఒక మూవీ ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో విజయ్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. బిచ్చగాడు మూవీ మంచి విజయం సాధించడంతో బిచ్చగాడు 2 మూవీ పై కూడా సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మరి ఈ రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల షేర్ ... 8.15 కోట్ల గ్రాస్ కలెక్షన లను వసూలు చేసింది.

రెండవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల షేర్ ... 6.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

మొత్తంగా ఈ సినిమా రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్ల షేర్ ... 14.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: