కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు అయినటు వంటి తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఆఖరుగా వారిసు అనే తమిళ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్మూవీ లో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జనవరి 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేశారు. 

ఇదే సినిమాను తెలుగు లో వారసుడు పేరుతో జనవరి 14 తేదీన థియేటర్ లలో విడుదల చేశారు. ఈ మూవీ తమిళ , తెలుగు భాషల్లో మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం ఈ స్టార్ హీరో లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ సెట్స్ పై ఉండగానే విజయ్ తన తదుపరి మూవీ ని కూడా ఓకే చేసుకున్నాడు. విజయ్ "లియో" మూవీ తర్వాత తాజాగా కస్టడీ మూవీ కి దర్శకత్వం వహించినటువంటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ విజయ్ కెరీర్ లో 68 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రక్కన కూడా వెలువడింది. ఈ సినిమాకు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ యువన శంకర్ రాజా సంగీతం అందించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: