
గత కొన్ని నెలలుగా చెన్నైలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఈయన వైద్యుల సూచన మేరకు హైదరాబాదులో AMG ఆస్పత్రికి మార్చారు. వైద్యులు నిరంతరం పర్యావేక్షణలో వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తూ ఉన్నారు. అయినా కూడా ఆయన కోలుకోలేకపోయారని తెలుస్తోంది సుమారుగా నెలరోజులపాటు మృత్యువుతో పోరాడిన శరత్ బాబు ఈరోజు మధ్యాహ్నం కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. శరత్ బాబు మరణ వార్తతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ విషాద ఛాయలు నెలకొన్నాయి దీంతో పలువురు సినీ సెలబ్రెటీలు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేస్తున్నారు..
అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థిస్తున్నారు శరత్ బాబు పార్థివ దేహాన్ని చెన్నైకి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ఇప్పటివరకు ఆయన 250కు పైగా సినిమాలలో నటించారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలలో జన్మించారు శరత్ బాబు.. ఈయన అసలు పేరు సత్యంబాబు దీక్షితులు.. శరత్ బాబు తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్ వంటి భాషలలో నటించారు. శరత్ బాబు మొదట గుప్పెడంత మనసు సినిమాతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది హీరో గానే కాకుండా విలన్ గా కూడా పలు సినిమాలలో నటించి మెప్పించారు. వెండితెరపై మంచి పాత్రలు పోషించిన ఈయన బుల్లితెరపై అంతరంగాలు అగ్నిగుండాలు వంటి సీరియల్స్ లో కూడా నటించారు.. 1974 లో నటి రమ ప్రభ ను వివాహం చేసుకున్నారు. అయితే ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది..