తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా నిలిచిన చిత్రం rrr ఈ చిత్రంలోని ప్రతి ఒక్క నటుడు కూడా ఎంతో అద్భుతంగా నటించారని చెప్ప వచ్చు. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అంతే అద్భుతమైన నటనను ఇందులో రే స్టీవెన్సన్ కూడా బ్రిటిష్ అధికారిగా అంతే అద్భుతంగా నటించారు. ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలో లీనమై నటించారని చెప్పవచ్చు. తాజాగా ఈ హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ మరణించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని rrr తన ట్విట్టర్ నుంచి తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈయన వయసు 58 సంవత్సరాలు అన్నట్టుగా తెలుస్తోంది



కానీ రే స్టీవెన్సన్ మరణానికి గల కారణాలు ఏంటనే విషయం మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు. ఇతని అకాల మరణంతో చలనచిత్ర పరిశ్రమ ఒక్కసారిగా శోకసముద్రంలోకి మునిగిపోయింది. rrr ఒక చిత్రంతోనే మంచి పాపులారిటీ సంపాదించిన ఈ నటుడు మరణ వార్త విని తెలుగు ప్రేక్షకులు కూడా  తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని మెప్పించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆస్కార్ అవార్డుని సైతం తన ఖాత లో వేసుకున్నది.


గత సంవత్సరం పలు భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం దాదాపుగా రూ .1200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇంతటి గొప్ప సినిమాని ఒక ప్రధాన పాత్ర పోషించిన నటుడు మరణ నిజంగానే విషాద కరం అని చెప్ప వచ్చు.. ఇక నిన్నటి రోజున నటుడు శరత్ బాబు మరణ వార్త మరువకముందే ఇప్పుడు తాజాగా రే స్టీవెన్సన్ మరణ వార్త విని సినీ ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. ఈ సినిమా విడుదలైన అన్ని భాషలలో కూడా మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: