కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన సినిమా లలో బిచ్చగాడు సినిమా ఒకటి. ఈ మూవీ లో విజయ్ ఆంటోనీ హీరో గా నటించాడు. ఈ మూవీ కి ముందు ఈ హీరో కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెద్దగా ఎలాంటి మార్కెట్ లేదు. కానీ ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను కొల్లగొట్టింది. ఈ మూవీ తో ఈ హీరో కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ హీరో తాను నటించిన అనేక సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేశాడు.

కానీ ఏ సినిమా కూడా బిచ్చగాడు రేంజ్ సక్సెస్ ను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించలేదు. తాజాగా ఈ నటుడు బిచ్చగాడు 2 అనే సినిమాలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమా తాజాగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను వరల్డ్ వైడ్ గా కంప్లీట్ చేసుకుంది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల షేర్ ... 8.15 కోట్ల గ్రాస్ కలెక్షన లను వసూలు చేసింది.

రెండవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల షేర్ ... 6.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.40 కోట్ల షేర్ ... 6.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.29 కోట్ల షేర్ ... 2.43 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.

మొత్తంగా ఈ సినిమా 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి వరల్డ్ వైడ్ గా 10.40 కోట్ల షేర్ ... 21.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: