యూట్యూబర్ హర్ష సాయి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో ఈయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యూట్యూబ్ ద్వారా లక్షల్లో డబ్బును సంపాదిస్తున్నాడు ఈయన. ఇక యూట్యూబ్ ద్వారా ఆయన సంపాదించిన డబ్బు మొత్తాన్ని పేదలకు సహాయం చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అలా పేదలకు సహాయం చేస్తూ సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు హర్ష సాయి. సమాజ సేవ కార్యక్రమాలతో మిలియన్లు కొద్ది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఆయనకి యూట్యూబ్లో 8.64 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. 

దాంతోపాటు ఇంస్టాగ్రామ్ లో నాలుగు మిలియన్లు.. ఫేస్ బుక్ తో పాటు మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో అన్నిట్లో కలిపి ఏకంగా 10 మిలియన్లకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఈయనకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగచెక్కర్లు కొడుతోంది. హర్ష సాయి ఆటు రాజకీయాల్లోకైనా లేదా ఇటు సినిమాల్లోకైనా వస్తాడంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినపడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక సినిమా ద్వారా హర్ష సాయి టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ఇప్పుడు ఒక వార్త మీడియాలో హల్చల్ చేస్తుంది.

ఇక బిగ్ బాస్ ఫెమ్ మిత్ర శర్మ ఈ సినిమాను నిర్మించబోతున్నారట. ఇక ఈ సినిమాలో హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడుగా కూడా హర్ష సాయి వ్యవహరించబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తన సేవా గుణంతో ఎంతోమంది కుటుంబాల్లోకి వెలుగు నింపిన హర్ష సాయి సినిమాల్లోకి వస్తుండడంతో ఆయన అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దీంతో ఎప్పుడు హర్ష సాయి ని హీరోగా చూస్తామని వెయిట్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. ప్రస్తుతం హర్ష సాయికి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: