‘బిచ్చగాడు 2’ మూవీ తమిళంలో కంటే తెలుగులో బాగా హిట్ అయింది. ఎవరూ ఊహించని ఈ హిట్ తో మళ్ళీ విజయ్ ఆంటోనీ క్రేజ్ తెలుగు ప్రేక్షకులలో పెరిగింది. ఇప్పటికే ఈ మూవీ బయ్యర్లు లాభాలా బాట పట్టడంతో ఈవారం విడుదలైన సినిమాలు అంతంతమాత్రంగానే ఉండటంతో ఈవారం కూడ ఈ మూవీకి మంచి కలక్షన్స్ వచ్చి బయ్యర్లకు మరిన్ని లాభాలు తెచ్చిపెడతాయని అంచనాలు ఉన్నాయి.


మూవీ కలక్షన్స్ తెలుగు రాష్ట్రాలలో బాగా ఉండటంతో విజయ్ ఆంటోనీమూవీ ప్రమోషన్ కోసం తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో పర్యటిస్తూ తనదైన రీతిలో ఈ మూవీ ప్రమోషన్ ను చేస్తున్నాడు. లేటెస్ట్ గా రాజమండ్రిలో విజయ్ ఆంటోనీ చేసిన ప్రమోషన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ నగారంలోని ఒక ఏరియాకు సంబంధించిన సుమారు 100 మంది బిచ్చగాళ్ళను ఎంపిక చేసి విజయ్ వారిని నగరంలోని ఒక ప్రముఖ రెస్టారెంట్ కు తీసుకువెళ్ళి వారికి మంచి భోజనం పెట్టించడమే కాకుండా వారు భోజనం చేస్తున్నప్పుడు విజయ్ స్వయంగా వడ్డించడం చాలామంది దృష్టిని ఆకర్షించింది.


అదేవిధంగా ఆ నగరానికి సంబంధించిన ఒక స్లమ్ ఏరియాను ఎంపిక చేసి అక్కడ పిల్లందరికీ ఐస్ క్రీమ్ లు ఇవ్వడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇలా ప్రతి ఊరు కలియతిరుగుతూ ఈమూవీకి సంబంధించిన కలక్షన్స్ పడిపోకుండా విజయ్ వ్యూహాత్మకంగా ప్రమోట్ చేస్తున్నాడు.


ఈసినిమా తమిళనాడులో కంటే తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా విజయవంతం అయిన సందర్భాన్ని బట్టి ‘బిచ్చగాడు’ మూవీ బ్రాండ్ తెలుగు ప్రేక్షకుల హృదయాలకు ఎంత ఎక్కువగా హత్తుకుపోయిందో అర్థం అవుతుంది. ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో విజయ్ మరిన్ని సినిమాలు చేసి తెలుగులో తన మార్కెట్ ను పెంచుకునే పనిలో ఉన్నాడు. కోలీవుడ్ హీరోలను తెలుగు హీరోలతో సమానంగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకుల అభిమానానికి అక్కడి హీరోలు అంతా సంతోషంలో మునిగి తేలుతున్నారు..  




మరింత సమాచారం తెలుసుకోండి: