పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాల్లో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. పవన్ ఆఖరుగా భీమ్లా నాయక్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో పవన్ తో పాటు రానా కూడా హీరో గా నటించాడు. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా ... తమన్మూవీ కి సంగీతం అందించాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా కనిపించనుండగా ... ప్రకాష్ రాజ్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ ను కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ముంబై లో మొదలు పెట్టింది. ముంబై లో ఈ మూవీ యొక్క మొదటి షెడ్యూల్ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే పూర్తి కాగా ... కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క రెండవ షెడ్యూల్ షూటింగ్ ను హైదరాబాద్ లో ఈ మూవీ బృందం స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

మూవీ లో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కోసం పవన్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా తీసుకొని రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... పవన్ ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అని ... ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ పవన్ ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా తీసుకోలేదు అని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: