అప్పట్లో పలు చిత్రాలలో హీరోగా నటించి ఎన్నో సక్సెస్లో అందుకున్నారు నటుడు శ్రీకాంత్.. మొదట చిన్న చిన్న సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించిన శ్రీకాంత్ ఆ తర్వాత హీరోగా మారి పలు చిత్రాలలో నటించి పలు రికార్డులను సైతం సృష్టించారు.

ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తున్నారు. అప్పట్లో శ్రీకాంత్ నటించిన ఒక సినిమా స్టార్ హీరోల రికార్డులను సైతం బద్దలు కొట్టి పెను సంచలనాలను సృష్టించిందట. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.స్టార్ హీరోలలో ఎన్టీఆర్ చిరంజీవి వంటి హీరోలు సైతం ఎక్కువగా రికార్డులను సైతం సృష్టించేవారు. ఇలాంటి రికార్డులను బద్దలు కొట్టి పెను సంచలనాలను సృష్టించింది శ్రీకాంత్ సినిమా ఏకంగా ఒక ఏడాది పాటు థియేటర్ లోని సక్సెస్ఫుల్గా రన్ అయిన చిత్రం ఆచిత్రమే 'పెళ్లి సందడి'.. అప్పటివరకు సాదాసీదా హీరోగా పేరు పొందిన శ్రీకాంత్ ఒక్కసారిగా ఈ సినిమాతో ఇండస్ట్రీలో టాప్ హీరోగా పేరుపొందారు. ఈ సినిమాతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే పెరిగిపోయిందట..

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో మోహన్ బాబు ప్రత్యేక అభ్యర్థిని మన్నించి ఆయన బ్యానర్లో మేజర్ చంద్రకాంత్ అనే సినిమాని చేశారు. 1993లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఉన్న ఇండస్ట్రీ రికార్డులను సైతం బద్దలు కొట్టింది. రెండవ స్థానంలో ఈ సినిమా నిలిచింది.దాదాపుగా అప్పట్లోనే రూ.9 కోట్ల రూపాయలు కలెక్షన్లను రాబట్టింది.. అయితే ఎటువంటి అంచనాలు లేకుండా 1996లో చిన్న సినిమాగా విడుదలైన శ్రీకాంత్ పెళ్లి సందడి సినిమా మేజర్ చంద్రకాంత్ చిత్రం కలెక్షన్లను దాటేసి ఇండస్ట్రీ హిట్టుగా కొనసాగుతున్న పెదరాయుడు కలెక్షన్ల సినిమాలను కూడా అధికమించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిందట.. అంతేకాకుండా 50 రోజులు 100 రోజులు సెంటర్లలో ఈ సినిమా రికార్డులను బద్దలు కట్టింది. చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ఘరానా మొగుడు కలెక్షన్లను కూడా దాటి పెను సంచలనాలను సృష్టించింది. ఇక అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: