కొంత కాలం క్రితం మలయాళం లో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో 2018 మూవీ ఒకటి. ఈ సినిమా 2018 వ సంవత్సరం కేరళలో జరిగిన ప్రకృతి విపత్తు ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా మలయాళం లో భారీ అంచనాల నడుమ విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మలయాళ ప్రేక్షకుల అంచనాలను అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఇప్పటి వరకు ఏ మలయాళ సినిమా కూడా కలెక్ట్ చేయని రేంజ్ లో కలెక్షన్ లను వసూలు చేసి మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 

ఇలా ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టడంతో మలయాళంలో ఈ సినిమా విడుదల అయిన కొన్ని రోజుల తర్వాత ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు. అప్పటికే ఈ సినిమా మలయాళం లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించి ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ తెలుగు లో విడుదల అయిన ఈ సినిమా తెలుగు లో విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి.

ఇప్పటి వరకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 10 రోజుల్లో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా పది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాలను ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పది రోజుల్లో 9.92 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: