టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ చేసిన డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా కేరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని ఏకంగా 25 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కి 2021లో టాప్ హిట్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా సిద్దుకి కూడా యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చింది.ఇదిలా ఉంటే ఇప్పుడు డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకి స్టొరీ, స్క్రీన్ ప్లే ఇంకా డైలాగ్స్ సిద్దు జొన్నలగడ్డ అందిస్తూ ఉండటం విశేషం. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ లోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. అద్భుతం ఫేమ్ మల్లిక్ రామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.సెప్టెంబర్ 15 వ తేదీన టిల్లు స్క్వేర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది.


అది ఈ సినిమాకి చాలా బెస్ట్ డేట్ అని చెప్పాలి. లాంగ్ వీకెండ్ పైగా సెప్టెంబర్ 18న వినాయకచవితి ఫెస్టివల్ ఉంటుంది. ఇక పండగకి మూడు రోజుల ముందుగానే టిల్లు స్క్వేర్ ని రిలీజ్ చేయబోతున్నారు.సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా ఈ టైమ్ టిల్లు స్క్వేర్ బాగా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఇక క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీలో హాట్ గా నటిస్తోంది. ఆమె పాత్ర స్లమ్ లో ఉండే కిలాడీ పిల్లగా ఉంటుందని సమాచారం తెలుస్తోంది. టిల్లు, అనుపమ మధ్య రొమాంటిక్ అండ్ కామెడీ సీన్స్ ఖచ్చితంగా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే అవకాశం ఉందంట.ఇక టిల్లు స్క్వేర్ రిలీజ్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ నందిని రెడ్డి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కనున్న మూవీలో నటించాల్సి ఉంది. ఈ సినిమా ఇప్పటికే కన్ఫర్మ్ అయిపొయింది. ఇక టిల్లు స్క్వేర్ తర్వాత అఫీషియల్ లాంచింగ్ ఉంటుందని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: