దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనదేశంలో రకరకాల బీమా పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా పలు పథకాలను ప్రవేశ పెడుతూ.. ఎంతోమందికి ఆసరాగా నిలుస్తున్న ఈ పథకాలు ప్రత్యేకించి మహిళల కోసం కూడా అద్భుతమైన పథకాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. దాని పేరే ఎల్ఐసి ఆధార్ షీలా.. ఈ పాలసీలో పొదుపుతో పాటు బీమా ప్రయోజనాలు కూడా లభిస్తాయి దీర్ఘకాలంలో అధిక సంపదను నిర్మించడంతోపాటు ఊహించని సంఘటనలు ఎదురైనప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక రక్షణను కూడా ఈ పాలసీ అందిస్తుంది.

ఈ పాలసీ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే మీరు తీసుకున్న పాలసీ మెచ్యూరిటీ వ్యవధి తీరిపోతే పూర్తి చెల్లింపును సొంతం చేసుకోవచ్చు.  ఒకవేళ అనుకోని ఘటనలో పాలసీదారుడు మరణిస్తే ఆర్థిక రక్షణను ఈ పథకం అందిస్తుంది.ఈ పాలసీ 8 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరికీ అందుబాటులో ఉంటుంది. పాలసీ 10 సంవత్సరాలనుంచి 20 సంవత్సరాల మధ్య కాల వ్యవధిలో మెచ్యూర్ అవుతుంది. గరిష్ట మెచ్యూరిటీ వయసు 70 సంవత్సరాలు కాగా ఉదాహరణకు మీరు 15 సంవత్సరాల వయసు నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే ప్రతిరోజు 87 రూపాయలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి రూ.31,755 అవుతుంది మరో పదేళ్లపాటు స్థిరంగా ఇదే డబ్బును ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు రూ.3,17,550 ఇన్వెస్ట్ చేస్తారు.

ఇక మీకు 70 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ మొత్తం మెస్చూర్ అవుతుంది కాబట్టి ఇది మీకు సుమారుగా 11 లక్షల మొత్తం ఆదాయాన్ని అందిస్తుంది ..అంతేకాదు పొదుపు బీమా సదుపాయాలను అందించి ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి ఈ పథకం చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ పథకం యొక్క పూర్తి వివరాల కోసం దగ్గర్లో ఉన్న బ్యాంకు ని లేదా ఎల్ఐసి ఏజెంట్లను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: