ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనం చేతిలో డబ్బు ఉంటే రకరకాల ఖర్చులను చేస్తూ ఉంటాము. మరి కొంతమంది డబ్బులు దాచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటే మరి కొంతమంది భూములు, ఇల్లు, ప్లాట్లు వంటివి కొంటూ ఉంటారు. అయితే ఇవన్నీ కాస్త రిస్క్ తో కూడిన పని అని కూడా చెప్పవచ్చు. అయితే ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బుని భద్రతతో పాటు ప్రతినెలా కూడా ఆదాయాన్ని మనం పొందుకొనే మార్గాలు చాలానే ఉన్నాయి. అలాంటి వారి కోసం పోస్ట్ ఆఫీస్ లో ఒక మంచి బెస్ట్ పధకం ఉన్నది.


కొన్ని పథకాలలో మనం ఫిక్స్డ్ డిపాజిట్ లలో పెట్టుబడి పెడితే ప్రతినెలా వడ్డీని తీసుకోవడం అసలు కుదరదు..కానీ పోస్ట్ ఆఫీస్ లో అందిస్తున్న మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వల్ల ప్రతినెల మనం వడ్డీని తీసుకోవచ్చు.. పదవి విరమణ చేసిన వారికి ఈ పథకం ఎక్కువగా ఉపయోగపడుతుంది.. ఎందుకంటే ఉద్యోగ విరమణ తర్వాత వారికి వచ్చిన డబ్బులను ఇక్కడ డిపాజిట్ చేసుకుంటే వడ్డీ రూపంలో కొంతమేరకు వారికి లభిస్తూ ఉంటుంది.

పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ మంత్లీ ఇన్కమింగ్ కి.. గరిష్టంగా రూ .9లక్షల వరకు సైతం డిపాజిట్ చేసుకొనే అవకాశం ఉంటుందట.. ఒకవేళ జాయింట్ అకౌంట్ ద్వారా అయితే రూ .15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.. ఇది 5 ఏళ్ల పాటు అలాగే ఉంచవచ్చు. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ లో ఇందుకుగాను వడ్డీ రేటు 7.4 శాతం వరకు ఉన్నది.. మనం పెట్టుబడి పెట్టిన దానిమీద వచ్చే వడ్డీని కూడా మనం ప్రతి నెల తీసుకోవచ్చు..


ఉదాహరణకు మనం జాయింట్ అకౌంట్ కింద రూ .15 లక్షలు డిపాజిట్ చేస్తే..7.4 శాతం వడ్డీతో ప్రతినెల 9,250 రూపాయలు చొప్పున వస్తుంది. దీంతో ఏడాదికి మనకి..1,11,000 రూపాయల చొప్పున వస్తుందట. అలా ఐదేళ్ల పాటు మనం డిపాజిట్ చేస్తే..5,55,000 లక్షల వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: