మ్యూజిక్ డైరెక్టర్ గా.. మంచి డ్యాన్సర్ గా కూడా గుర్తింపుతెచ్చుకున్న తరువాత ఆమె హీరోయిన్ గా మారింది. కెరీర్ ప్రారంభంలో ఈమె నటించిన సినిమాలు అన్నీ ప్లాపులు అయ్యాయి. అయితే ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఈమెను గోల్డెన్ లెగ్ గా మార్చేసింది. ఆ తరువాత ఈమె నటించిన సినిమాలు అన్నీ దాదాపు హిట్లే. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైములో విదేశీయుడితో ప్రేమలో పడి సినిమాలను నిర్లక్ష్యం చేసింది. అయితే కొన్నాళ్ల తరువాత అతనితో బ్రేకప్ చెప్పడంతో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.