సినీరంగంలో టాలెంట్ కంటే.. అదృష్టం పాళ్లు ఎక్కువ.. అందుకే డాక్టర్ కాబోయి.. యాక్టర్ అయ్యా అనే రకం నటులు ఎక్కువగా కనిపిస్తుంటారు. అలాంటి నటుడే కమేడియన్ రఘు కారుమంచి.. తెలంగాణ యాసలో డైలాగులు అదరగొడ్తూ కామెడీ ఇరగతీస్తున్నాడు.. ఆది తో ఎంట్రీ ఇచ్చి.. అదుర్స్ తో బాగా పేరుతెచ్చుకున్నాడు. 

Image result for raghu karumanchi

లేటెస్టుగా ఖైదీ నెంబర్ 150, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలతో మరోసారి తనేంటో రుజువు చేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలే డిగ్రీలు కూడా కంప్లీట్ చేసి ఉండరు. మరి అలాంటిది రఘు కారుమంచి ఏం చదివాడో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు.. ఆయన నేను చదివింది ఎంబీయే ఇంటర్నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ. 

Image result for raghu karumanchi
2010లోనే చీఫ్‌ మార్కెటింగ్‌ ఇంజినీర్‌గా మంచి పొజిషన్లో ఉన్నాడు. మరి అలాంటివాడు సినిమాల్లోకి ఎలా వచ్చాడంటారా... దానికీ ఓ నేపథ్యం ఉంది.. నిజానికి రఘుకు నటించే ఉద్దేశమే లేదు.. అప్పట్లో దర్శకులు వీవీ వినాయక్‌, సురేందర్‌ రెడ్డి అమీర్‌పేట్‌లోని శాంతిభాగ్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఉండేవారు.. 


వారు ఉండే ఫ్లాట్ లోనే పైన రఘు ఉండేవారు.. అలా వారికి పరిచయం. రఘు యాస చూసి.. నటనలో ట్రై చేయమన్నారట. వీవీ వినాయక్‌ తాను దర్శకత్వం హించే మొదటి సినిమాలో కచ్చితంగా ఛాన్స్ ఇస్తానని కమిట్ అయ్యారట. అలా ‘ఆది’ సినిమాలో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత అదుర్స్‌ తో బాగా పేరు వచ్చిన సంగతి తెలిసిందే. అదీ రఘు కారుమంచి నేపథ్యం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: