రానా దగ్గుబాటి... తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ సినిమాలు చేసి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమాలో భల్లాల పాత్రతో మెప్పించి దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తన ఫ్రెండ్లీ నేచర్ తో ఇండస్ట్రీ లోనూ బోలెడు మంది స్నేహితులు ఉన్నారు.


రానా ఈ మధ్య కిడ్నీ సంబంధించిన వ్యాధికి గురి కావడంతో అమెరికాలో  శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ఇది సక్సెస్ ఫుల్ గా జరిగింది కూడా. తను బాగానే ఉన్నాను అని... అభిమానులు, స్నేహితులు ఆందోళన చెందకూడదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు కూడా రానా. తాను ఈరోజు ఇండియా వస్తున్నట్లు పేర్కొన్నాడు. కానీ... ఇంకా అమెరికాలోనే ఉన్నారు రానా.


చికిత్స పూర్తి అయినా... మరి కొన్ని టెస్టులు చేయాల్సి ఉంది అని .. అన్ని చేయించుకుని వెళ్తే బాగుంటుంది అని తెలిపారట వైద్యులు. దీంతో వారి సలహా మేరకు అక్కడే ఉండిపోవలసి వచ్చిందట రానా. మరో రెండు వారాలు అక్కడే ఉండాల్సి వస్తుంది అని తెలుస్తోంది. దీంతో సెప్టెంబర్ మొదటి వారం నుంచి స్టార్ట్ కావాల్సిన విరాట పర్వం సినిమా తొలి షెడ్యూల్ ఆగిపోయింది. మరో వైపు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిరణ్య కశప సినిమా కూడా రానా మీదే ఆధారపడి ఉంది. రానా త్వరగా రికవరీ అయితే ఈ షూటింగ్ లు మొదలు పెట్టాల్సి ఉంది.


రానా ఆరోగ్యం అంతగా సహకరించక పోయినప్పటికీ సినిమాలను ఎక్కడ మానకుండా షూటింగులకు యధా విధంగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రొడ్యూసర్లు నా గురించి నష్ట పోకూడదు అని ఒకసారి సినిమా ఒప్పుకున్న తర్వాత ఎంత కష్టమొచ్చినా నష్టమొచ్చినా కొనసాగుతూనే ఉండాలి అన్న సందేశాన్ని కూడా రానా అందరికీ ఇస్తున్నాడు. రాణా త్వరగా కోలుకుని మళ్లీ మన అందరి ముందుకు రావాలి అని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: