నాగ చైతన్య ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఒక లైలా కోసం.. గుండె జారి గల్లంతయ్యిందే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన డైరక్టర్ విజయ్ కుమార్ కొండ. ఇప్పుడు చైతుతో ఒక లైలా కోసం సినిమా చేస్తున్నాడు. మాస్క్ సినిమాతో అలరించిన పూజా హెగ్దే ఈ సినిమాలో చైతు తో రొమాన్స్ చేస్తుంది. అన్నపూర్ణ మూవిఎస్ బ్యానర్ లో ఈ సినిమాను కింగ్ నాగార్జున నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైన్ గా తెరకెక్కిస్తున్నారట. మొదటి సినిమాతో ఆడియెన్స్ పల్స్ పట్టేసిన డైరక్టర్ విజయ్ కుమార్ ఈ సినిమా కూడా ఆడియెన్స్ కి నచ్చేలా తీస్తున్నాడట. లాస్ట్ ఇయర్ తడాకా హిట్ తో సరిపెట్టుకున్న నాగ చైతన్య తను నటించిన ఆటో నగర్ సూర్య సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.. ఈ నెల చివరన రిలీజ్ అవుతున్న ఆటో నగర్ సూర్య లో చైతుకి జోడీగా సమంత నటించిది.
ఇక ఒక లైలా కోసం సినిమా సమ్మర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు..ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కెరియర్ పరంగా కొంచం వెనుకపడి ఉన్న నితిన్ కి ఇష్క్ తర్వాత దాని కంటే సూపర్ హిట్ సినిమా ఇచ్చి తన ఫేట్ పూర్తిగా మార్చేసిన విజయ్ కుమార్ ఇప్పుడు చైతన్యని కూడా మంచి హీరోగా నిలబెట్టనున్నాడనడంలో సందేహంలేదు. ఏది ఏమైనా ఒక లైలా కోసం సినిమా నాగ చైతన్య కి ఎంతముఖ్యమో విజయ్ కి కూడా అంతే ముఖ్యం ఎందుకంటే ద్వితియా విగ్నం గా రాబోతున్న ఈ మూవీ డైరక్టర్ విజయ్ కి మంచి పేరు సంపాదిస్తుందో లేదో చూద్దాం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి