మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో అత్యంత రహస్యంగా మొదలైన క్రిష్ పవన్మూవీ ప్రారంభోత్సవంనాడు పవన్ తన గుబురు గెడ్డం పూర్తిగా తీసివేసి పెరిగిన జుట్టు తో మీసం తో ఆ మూవీ షూటింగ్ స్పాట్ కు వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి అలాంటి లుక్ ను ఆలోచించి డిజైన్ చేసిన వ్యక్తి దర్శకుడు క్రిష్ అయినప్పటికీ ఆ లుక్ లో క్రిష్ కు ఎదో వెలితిగా అనిపించి ప్రస్తుతం అయోమయంలో ఉన్నట్లు టాక్. 


దీనికితోడు పవన్ ముఖం లో గ్లో తగ్గడమే కాకుండా ముఖం లో ఆకర్షణ తగ్గడం క్రిష్ దృష్టికి వచ్చినట్లు టాక్. దీనితో విజువల్ ఎఫెక్ట్స్ తో పవన్ ముఖంలో గ్లో తీసుకు రావడానికి ప్రయత్నాలు చేసినా ఎంతవరకు ఆ ప్రయత్నాలు సక్సస్ అవుతాయి అన్న సందేహాలు కూడ క్రిష్ ను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. 


ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీకి సంబంధించిన పవన్ లుక్ విషయమై మరొకసారి ఫోటో షూట్ నిర్వహించి ఆ తరువాత ఒక ఫైనల్ నిర్ణయం రావాలని క్రిష్ భావిస్తున్నట్లు సమాచారం. దీనికితోడు మళ్ళీ పవన్ అమరావతి రైతులను కలవడానికి వారి దగ్గరకు వెళ్ళే కార్యక్రమం చేపట్టడంతో ఇప్పటికే పెరుగుతున్న ఎండలు పవన్ లుక్ కు మరింత హాని చేస్తాయి అని తనకు అనిపించినా ప్రస్తుతం పవన్ కు చెప్పలేని స్థితిలో క్రిష్ ఉన్నాడు అని అంటున్నారు. 


ఇది ఇలా ఉండగా ఈ షెడ్యూల్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీ లో వాటర్ బ్యాక్ డ్రాప్ లో ఒక సెట్ వేశారట. ఇప్పుడు ఆ సెట్ లో పవన్ కళ్యాణ్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. మొఘ‌లాయిల కాలానికి సంబంధించిన క‌థ ఇది అని అంటున్నారు. మ‌హ‌మ్మ‌దీయుల ప‌రిపాల‌నా కాలం అప్ప‌టి ప‌రిస్థితులు ఇవన్నీ ఈ మూవీలో కనిపిస్తాయని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ బికినీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న వాణికపూర్ ఈ మూవీలో హీరోయిన్ గా ఎంపిక అయిన నేపద్యంలో పవన్ వాణికాపూర్ ల జంట తెర పై ఎంత వరకు బాగుంటుంది అన్న సందేహాలు కూడ వస్తున్నాయి. ఇలా ప్రస్తుతానికి పవన్ క్రిష్ ల ప్రారంభం అయి నాలుగు రోజులు కూడ అవ్వకుండానే ఈ మూవీ పై అనేక సమాధానం లేని ప్రశ్నలు హడావిడి చేస్తున్నాయి..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: