తమిళంలో సూపర్ హిట్టైన 96 మూవీని తెలుగులో రీమేక్ చేశారు దిల్ రాజు. తన 17 ఏళ్ల సిని కెరియర్ లో దిల్ రాజు చేసిన ఫస్ట్ రీమేక్ మూవీ ఇదే. అక్కడ విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా తెలుగు రీమేక్ జానులో శర్వానంద్, సమంత నటించారు. రామ్, జాను పాత్రలకు వారిద్దరు 100 పెర్సెంట్ న్యాయం చేశారు. ఫిబ్రవరి 7 న రిలీజయిన జాను సినిమాకు మంచి రివ్యూస్.. పాజిటివ్ టాక్ వచ్చినా సరే వసూళ్లు మాత్రం రావట్లేదు. 

 

కేవలం క్లాస్ పీపుల్స్ తప్ప బి, సి సెంటర్స్ లో సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబాట్టడం లేదు. ఇక ఈ సినిమా మండే రోజు కూడా వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. మండే రోజు కేవలం 45 లక్షలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్లు వరల్డ్ వైడ్ 7 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ రకంగా చూస్తే జాను డిజాస్టర్ అనక తప్పదేమో.. సినిమాకు వసూళ్లు రాకున్నా దిల్ రాజు ప్రమోషన్స్ మాత్రం ఆపట్లేదు. 

 

అయితే సినిమా వసూళ్లు ఎలా ఉన్నా శర్వా,  సామ్ ఎఫర్ట్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. కొన్ని సినిమాలు వసూళ్ల పరంగా బాగా లేకున్నా ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం నిలిచిపోతారు. పెళ్లి తర్వాత సమంత సినిమాల సెలక్షన్ అదిరిపోతుంది. లాస్ట్ ఇయర్ మజిలీ, ఓ బేబీ సినిమాలు హిట్ అందుకున్న సామ్ ఈ ఇయర్ జానుతో గుడ్ స్టార్ట్ అందుకుంది. ఇక ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ లో నటిస్తున్న అమ్మడు తన మనసుకి నచ్చిన సినిమాలానే చేస్తానని అంటుంది. జాను సమంత కెరియర్ లో చెప్పుకోదగిన పాత్రల్లో ఒకటని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: