ఒక హీరో కు 7 ఏళ్లపాటు వరసగా 11 ఫ్లాప్ సినిమాలు వస్తే ఆహీరో వైపు ఎవరు చూడరు. అయితే నితిన్ మాత్రం డిఫరెంట్. గోడకు కొట్టిన బంతిలా తిరిగి మళ్ళీ ట్రాక్ రికార్డులోకి రావడమే కాకుండా ప్రస్తుతం వరసపెట్టి సినిమాలు చేస్తూ తన మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.


ఇలాంటి పరిస్థితులలో ఈ వారం విడుదల కాబోతున్న ‘భీష్మ’ మూవీని ప్రమోట్ చేస్తూ నితిన్ ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై తనకు ఉన్న అభిమానాన్ని మరొకసారి చాటుకున్నాడు. తాను హీరోగా ఏ స్థాయిలో ఉన్నా పవన్ రీ ఎంట్రీ ఫిలిం ‘పింక్’ రీమేక్ ను మొదటిరోజు మార్నింగ్ షోకు ధియేటర్ కు వెళ్ళి ఆయన అభిమానిగా చొక్కాలు పేపర్లు చింపుకుని ధియేటర్ లో సందడి చేయాలని ఉంది అంటూ తన మనసులోని కోర్కెను బయట పెట్టాడు. 


అంతేకాదు తాను ఇప్పటికీ ఎప్పటికీ పవన్ వీరాభిమాని ని అన్న విషయాన్ని క్లారిటీ ఇస్తూ మరొకసారి పవన్ అభిమానులకు నితిన్ జోష్ ను నింపుతున్నాడు. ఇదే సందర్భంలో తన భార్య షాలిని గురించి మాట్లాడుతూ 8 సంవత్సరాల క్రితం ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా తనకు పరిచయం అయిన షాలిని ని ప్రేమిస్తున్నాను అంటూ ముందుగా ప్రపోజ్ చేయడమే కాకుండా తాను ఒక కొత్త స్టైల్ లో ఒంటి కాలి పై లేచి ఒంగి తన లవ్ ప్రపోజ్ చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 


అయితే ఈ 8 సంవత్సరాలు మీడియా కంట పడకుండా తమ ప్రేమ కొనసాగించడానికి తన కారులో లాంగ్ డ్రైవ్ కు వెళ్ళడం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత హైయత్ హోటల్ కు వెళ్ళి ఒక మూల కూర్చుని ఫుడ్ తినడం లాంటి పనులు చేస్తూ తన ప్రేమను కొనసాగించిన విషయాన్ని బయట పెడుతూ తాను అలా ప్రేమలో పడ్డాను అంటూ షాలిని కి సంబంధించిన అనేక విషయాలను షేర్ చేసాడు నితిన్..

మరింత సమాచారం తెలుసుకోండి: