టాలీవుడ్ బాహుబలి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ మూవీ దర్శకుడు krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, యువి క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఖర్చుతో ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇకపోతే దీని తర్వాత ప్రభాస్ నటించబోయే తదుపరి సినిమా గురించిన అఫీషియల్ ప్రకటన నిన్న బయటకు రావడం జరిగింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతి మూవీస్ బ్యానర్ పై యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న తదుపరి సినిమా తెరకెక్కనుంది. 

 

ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాదు ఏకంగా పాన్ వరల్డ్ సినిమా అని దర్శకుడు వంశీ తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ సినిమా యొక్క నేపథ్యం, కథ గురించి నేడు టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త విస్తృతంగా ప్రచారమవుతోంది. అదేమిటంటే గతంలో మహానటి సినిమా తీసి సక్సెస్ అందుకున్న వంశీ, మీడియాతో మాట్లాడుతూ తనకు పాతాళభైరవి మాదిరిగా మాయలు, మంత్రాలతో కూడిన గొప్ప సినిమా తీయాలని ఉందని చెప్పడం జరిగింది. అయితే మహానటి వచ్చి ఏడాదికిపైగా అవుతుండటంతో, ఈ మధ్యలో వంశీ ఒక అద్భుతమైన చందమామ కథ రాసుకున్నారని, ఇక ఈ కథకు హీరోగా ప్రభాస్ అయితేనే సరిపోతారని భావించి ఆయనను కలిసి పూర్తి స్క్రిప్ట్ వినిపించడం, స్క్రిప్ట్ నచ్చిన ప్రభాస్ వెంటనే సినిమా చేయడానికి అంగీకరించటం జరిగాయని అంటున్నారు. 

 

అయితే టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎన్నో ఏళ్ల క్రితం మాయలు, మంత్రాలతో కూడిన జానపద చిత్రాలు వచ్చాయి. అయితే ఇటీవల మాత్రం సిద్ధార్థ హీరోగా కోవెలమూడి ప్రకాష్ దర్శకత్వంలో వచ్చిన అనగనగా ఒక ధీరుడు ఒక చందమామ కథ మాదిరి సినిమానే, అయితే అది రిలీజ్ తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ఘోరంగా ఫ్లాప్ అయింది. మరి ఆ విధంగా చూస్తే ప్రభాస్, అశ్విన్ డైరెక్షన్లో చేయనున్న ఈ సినిమా చందమామ కథ అయితే, ఒకరకంగా ఆయన తేనెతుట్టె లో వేలు పెడుతున్నట్లేనని ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చిన అసలుకే మోసం వస్తుందని కొందరు అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఎక్కడా కూడా అధికారిక సమాచారం మాత్రం లేదు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: