చిరంజీవి కొరటాల మూవీ ‘ఆచార్య’ భూమి గుండ్రంగా ఉన్నట్లుగా ఎక్కడ మొదలైందో అక్కడకే వచ్చి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఆచార్య’ మూవీలో రామ్ చరణ్ చేయవలసిన పాత్రను మహేష్ చేస్తున్నాడు అంటూ అన్ని ప్రముఖ పత్రికలు ఛానల్స్ లో వార్తలు వచ్చిన పరిస్థితులలో ఆ వార్తలను ఇటు మెగా కాంపౌండ్ కానీ అటు మహేష్ కాని ఖండించక పోవడంతో ‘ఆచార్య’ లో మహేష్ ప్రత్యేక పాత్రలో కనిపించడం ఖాయం అని అనుకున్నారు అంతా.


ఈ వార్తలు వచ్చి వారం రోజులు దాటిపోతున్నా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కొరటాల శివ నుంచి రాకపోవడంతో అసలు మహేష్ ఈ మూవీలో నటించడానికి ఒప్పుకున్నాడా లేదా అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలలో సందేహాలు మొదలయ్యాయి. తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల రాయబారం ఫలించి మహేష్ ఈ మూవీలో ప్రత్యేక పాత్రను చేయడానికి తన అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. 


అయితే మహేష్ కు ప్రస్తుతం ఉన్న మార్కెట్ రీత్యా 50 కోట్ల పారితోషికం అందుతున్న పరిస్థితులలో ఈ మూవీలో మహేష్ పాత్ర 40 నిముషాలు ఉండే పరిస్థితులలో మహేష్ కాల్ షీట్స్ 30 రోజులు కావలసి ఉండగా కనీసం మహేష్ కు 25 కోట్ల పారితోషికం ఇవ్వవలసిన పరిస్థితి అని అంటున్నారు. దీనితో ‘ఆచార్య’ బడ్జెట్ విపరీతంగా పెరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి.  వాస్తవానికి ఈ మూవీలో మహేష్ నటించే విషయంలో ఇంకా పారితోషిక విషయంలో ఇంకా చర్చలు ప్రారంభం కాలేదని తెలుస్తోంది. 


ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు చిరంజీవి మళ్ళీ యూటర్న్ తీసుకుని ఈ సినిమాలో ముందు అనుకున్నట్లుగానే రామ్ చరణ్ తో నటింపచేసి ‘ఆచార్య’ ను ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తరువాత వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేస్తే బడ్జెట్ పరంగా పెద్దగా ఖర్చులు పెరగవు కదా అన్న ఆలోచనలలో చిరంజీవి ఉన్నట్లు టాక్. మహేష్ ను ఈ మూవీ ప్రాజెక్ట్ లో కలుపుకోవడం వల్ల వచ్చే అదనపు బిజినెస్ ఎంత ఒకవేళ ముందుగా అనుకున్నట్లుగా చిరంజీవి చరణ్ లు కలిసి నటిస్తే జరిగే బిజినెస్ ఎంత అన్న విషయమై ఇప్పుడు చిరంజీవి లోతుగా ఆలోచిస్తూ మహేష్ అంగీకారం లభించినా ఈ విషయమై వేగం పెంచకుండా ఒకటికి వందసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుందాము అంటూ కొరటాల స్పీడ్ కు బ్రేకులు వేస్తున్నట్లు టాక్. ఇది ఇలా ఉంటే ‘ఆచార్య’ సినిమా చిరంజీవి సినిమాగా ప్రేక్షకులు చూడాలి కాని ఆ మూవీని మహేష్ సినిమాగా అల్లు అర్జున్ సినిమాగా ప్రేక్షకులు భావించడం చిరంజీవికి ఇష్టం లేదు అన్న గాసిప్పులు సందడి చేస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: