పవర్ స్థార్ వకీల్ సాబ్...ఫస్ట్ లుక్ సూపర్బ్ అంటుండగానే మరో సెన్సేషన్ క్రియేట్ చేసిందీ మూవీ టీం. ఉమెన్స్ డే సందర్భంగా మహిళల గొప్పదనాన్ని చెబుతూ...సినిమాలో సాగే ఓ పాటను జనాల్లోకి వదిలింది. స్త్రీ గొప్పతనాన్ని తెలిపే విధంగా రామజోగయ్య శాస్త్రీ రాసిన లిరిక్స్ కు తమన్ మ్యూజిక్ మరింత అందాన్ని తెచ్చింది. మగువా...మగువా లోకానికి తెలుసా నీవిలువ...మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కనవా అంటూ సాగే పాటకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

 

IHG

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న వకీల్ సాబ్ మూవీ...హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్. హిందీలో అమితాబచన్ పోషించిన పాత్రను... తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తాప్సీపాత్రలో నివేదా థామస్ నటిస్తున్నారు. ఇక ఈ మూవీని వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా శ్రీరామ్ వేణు దర్శకుడిగా తన టాలెంట్ ను నిరూపించుకునేందుకు కష్టపడుతున్నారు. 

 

IHG

 

ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ కు మంచి గుర్తింపు ఉంది. మంచి ఊపున్న బీట్ పాటలతో వరుస హిట్ లు అందుకుని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు తమన్. మనోడి జోరుకు రామజోగయ్య శాస్త్రీ కలం తోడవ్వడంతో.. మగువ మగువ పాట ఆడియన్స్ ను కదిలించింది. ఇక పాటకు మరో అట్రాక్షన్ సిద్ శ్రీరామ్. తన స్వీట్ అండ్ యూనిక్ వాయిస్ తో ఆడియన్స్ ను కట్టిపడేసే సిద్ శ్రీరామ్ కేరీర్ లో మగువా మగువా పాట  కూడా ఒక మైల్ స్టోన్ అవుతుందంటున్నారు ఆడియన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: