ఇప్పుడు ఐటం సాంగ్స్ వేరు. అప్పటి ఐటం సాంగ్స్ వేరు. ఇప్పుడు ఎంతో మంది హీరోయిన్ల సైతం ఐటం సాంగ్స్ చేస్తున్నారు. కానీ అప్పుడు కొందరే ఉండేవారు. అందులో బాగా మెప్పించేవారు మరీ తక్కువ. ఆ పాటలు నిజంగా జోష్ తీసుకొచ్చేవి. యూత్ అంతా ఆ పాటలకి ఫిదా అయ్యిపోక తప్పదు. అయితే ఆ పాటలు ఎంతో మత్తుగా మనసులోకి వెళ్ళిపోయేవి. ఇంక ఓ మాయ చేసేవి కుర్రాళ్ళని. సిల్కు స్మితగా తెలిసిన ఈమె అసలి పేరు విజయలక్ష్మి. ఈమె కేవలం తెలుగులోనే కాదు తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా ప్రసిద్ధి.

 

 

వగలిమారి పడతి పాత్రలు పోషిస్తూ సై అనిపించేది ఈ భామ. విజయలక్ష్మీ అయిన ఈమె తెర మీద స్మితగా పరిచయం అయ్యింది. తమిళ సినిమాలో ఈమె సిల్కు పాత్ర పోషించడం వల్లన ఈమె పేరు సిల్కు స్మిత అయ్యింది. అయితే ఈమె ఎక్కువ ప్రజాదరణ కూడా పొందింది. శృంగార నృత్యాలు ఈమెకి ఎక్కువ పేరు తీసుకుని వచ్చాయి. ఈమె డాన్స్ కు కుర్రకారు చిందులేస్తూ ఆనందించేవారు. నర్తకిగా, ప్రేక్షకులను ఉర్రూతలూగించే నృత్యాలతోను, కామోద్దీపనము కలిగించే దుస్తులతో ఈమె బాగా ఆకర్షించేది. దానితో జనం ముగ్ధులైపోయేవారు.

 

 

ఈమె 1981 సంవత్సరంలో సీతాకోక చిలుక సినిమాలో నటించి మంచి నటనతో పేరు పొందింది. లయనం అనే ఓ పెద్దల సినిమాలో కూడా ఈమె నటించింది. ఆ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆమెకి ఎంతో మంచి పేరు తెచ్చింది ఆ సినిమా. భలే బుల్లోడు, కిరాతకుడు, రంగ, ఛాలెంజ్ ఇలా ఎన్నో సినిమాల్లో సిల్కు స్మిత పాత్రలు చెప్పుకోదగ్గవి. ఇలా అనేక సినిమాలు చేసింది సిల్కు స్మిత. కానీ ఈమె ఐటం సాంగ్స్ చూస్తే అలుపు కూడా ఊపు అవ్వక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: