టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం యొక్క షూటింగ్ చాలా వరకు పూర్తయింది. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మూడు డిఫరెంట్ షేడ్స్ లలో కనిపించనున్నాడని వార్తలు వెల్లువెత్తుతున్నాయి.




విశ్వసనీయ వర్గాల నుండి వచ్చిన సమాచారం ప్రకారం... తారక్ బ్రిటిషు సైన్యాన్ని ధ్వంసం చేస్తూ వారి ఆస్తులను దోచుకుంటాడు. అయితే ఇలా చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ తన ఐడెంటిటీని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాడట. ఒక షేడ్ లో గుండుతో కూడా కనిపించనున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఐతే తారక్ యొక్క త్రీ షేడ్స్(గెట్ అప్స్) సినిమా మొత్తం లోనే హైలెట్ గా మారనున్నాయని బలంగా వార్తలు వస్తున్నాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ యాసలో మాట్లాడనున్నాడని, ఆ యాస అభిమానుల మతి పోగొడుతుంది తెలుస్తుంది. రామ్ చరణ్ కూడా మల్టిపుల్ షేడ్స్ లో కనిపించనున్నాడో లేదో తెలియాల్సి ఉంది.




వచ్చే ఏడాది జనవరి 8న విడుదలయ్యే ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని DVV ఎంటర్టైనర్స్ కింద DVV దానయ్య రూ. 400 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ కుర్ర హీరోయిన్ అలియా భట్, ఐరిష్ నటి ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో నటించడం ఆసక్తిని రేపుతోంది. అజయ్ దేవగన్, శ్రేయ శరణ్ ఇంకా తదితర ఇంటర్నేషనల్ నటీనటులు ఈ సినిమాలో నటించడం విశేషం. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ టైగర్ తో గానీ తోడేలు తో కానీ పోరాడినట్లు ఈ సినిమాలో చూపించనున్నారు. ఏదేమైనా ఈ సినిమా గురించి వస్తున్న వార్తలు వింటుంటే ప్రతి ఒక్కరు సినిమా తొందరగా రిలీజ్ చేస్తే బాగుండు అని అనుకుంటున్నారు. బాహుబలి కంటే పెద్ద హిట్ గా ఈ సినిమా చరిత్రకేక్కనుందని అనుకోవడంలో పెద్ద తప్పేమీ లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: