ప్రస్తుతం టాలీవుడ్ లో విపరీతమైన  క్రేజ్ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. తీసింది కొన్ని సినిమాలు, అందులోను విజయం సాధించినవి కొన్ని సినిమాలు మాత్రమే. అయిన గాని  హిట్లు, ఫట్లు అనే సంబంధం లేకుండా అభిమానులని  ఆకర్షిస్తాడు. ఒక్క అభిమానులనే కాదండోయ్ ఏకంగా సినీ హీరోయిన్స్ నే ఆకట్టుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ  పేరు చెప్పిన గాని, అతని గూర్చి మాట్లాడాలన్నా గాని హీరోయిన్స్ తెగ ఆత్రుత చూపిస్తున్నారు. అయితే  ఇప్పటికే జాన్వీ కపూర్, అలాగే అలియాభట్ కూడా ఒకసారి ఇంటర్వ్యూ లో విజయ్ దేవరకొండ  ఒకసారి అడగక  అతనితో కలిసి నటించాలని, మంచి క్రెజి హీరో అని వాతాబు ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక  హీరోయిన్  కూడా  విజయ్  లిస్ట్ లో చేరిపోయింది. 

 

 

హీరోయిన్ ఎవరో కాదు బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది.  తను ఎవరో కాదు  రకుల్ ప్రీత్ సింగ్.  వివరాల్లోకి వెళితే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ చిత్రాలను బ్యాలెన్స్ చేసుకుంటూ తన కెరీర్‌ను చక్కదిద్దుకొంటున్నది. హిందీలో ఆమె నటించిన దే దే ప్యార్ దే చిత్రంలో హాట్ హాట్‌గా నటించి ఆకట్టుకొన్నది. బాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి  సిద్ధమవుతున్నది. అయితే  ఇప్పుడు  కరోనావైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందడంపై రకుల్  ప్రేక్షకులకు ఒక సందేశాన్ని  ఇచ్చారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. 

 

 


ఇలాంటి సంక్షోభంలో ప్రతీ ఒక్కరు స్వచ్ఛందంగా ఆరోగ్య సూచనలు, సలహాలు పాటించాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ప్రభుత్వాలకు అండగా నిలువాలి అని రకుల్ సూచించారు. అలాగే  తాజాగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ సహజ నటుడు. నటించడానికే పుట్టినట్టు కనిపిస్తాడు. బార్న్ టు బి స్టార్ అంటూ విజయ్ దేవరకొండపై రకుల్ ప్రశంసలు కురిపించారు. విజయ్ దేవరకొండ భవిష్యత్‌లో మంచి నటుడిగా పేరు తెచ్చుకొంటారు అని రకుల్  చెప్పారు. అలాగే ఏలాంటి పాత్రలోనైనా ఆయన  ఇట్టే నటిస్తారు అని పొగిడింది.

 

 

 అలాగే రకుల్, విజయ్ దేవరకొండతో నటించే అవకాశం  కోసం ఎదురు చూస్తుంది అంట.  ఇద్దరి జోడి వెండితెర మీద హాట్ జోడిగా మారుతుంది అని కొనియాడింది. సరైన కధ, నిర్మాత దొరికితే తప్పకుండ నటిస్తాను అంది. ప్రస్తుతం  విజయ్ దేవరకొండ  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కని కరొనావైరస్ కారణంగా ఫైటర్ చిత్రం వాయిదా పడింది.ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే మాత్రం విజయ్ లైఫ్ మారిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: