కరోనా దెబ్బకి ఎక్కడికక్కడ ప్రజలు కామ్ అయిపోయారు. తమ ప్రాంతాల్లో ఉన్న వాళ్లు ఇళ్లలో ఉండిపోయారు. వేరే ప్రాంతాల్లో ఉన్నవారు సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరో 20రోజులు ఇదే పరిస్థితి. ఇక విదేశాల్లో ఉన్న వారు కూడా మొన్నటి వరకూ ఇండియాకు చేరుకున్నారు. వీరిలో హిందీ నటి నీతూ చంద్ర కూడా ఉంది. 2006లో తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుమంత్ హీరోగా వచ్చిన గోదావరి సినిమాలో నటించిన నీతూ. కరోనా దెబ్బకు ఇటివల అమెరికాలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరించింది.

 

 

‘ఇటివల ఓ సినిమా షూటింగ్ కోసం కాలిఫోర్నియా వెళ్లాను. కరోన ఎఫెక్ట్ తో బార్, రెస్టారెంట్స్ తో పాటు షూటింగ్ జరిగే స్పాట్ కూడా మూసేశారు. ఫుడ్ దొరికేది కాదు. ఒకవేళ దొరికినా చాలా తక్కువ పెట్టేవారు. ఇంకా కావాలంటే రేపు రమ్మనే వారు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉండటం చాలా కష్టంగా ఉండేది. ఇండియాకు వచ్చేయాలని కుటుంబ సభ్యుల నుంచి ఫోన్లు వచ్చేవి. మొత్తానికి ఇండియాకి వచ్చేశాం. రాగానే ఎయిర్ పోర్టులో అధికారుల పరిక్షలు. ఎన్నో టెస్టుల తర్వాత కరోనా ఎఫెక్ట్ లేదని తెలిసిన తర్వాత ఇళ్లకు పంపారు. ఇప్పుడు ఇంట్లో హ్యాపీగా ఉన్నాను. మీరంతా కూడా ఇంట్లో ఉండి బయటకు రాకుండా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి’ అని తన అనుభవాలను పంచుకుంది.

 

 

కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోతోంది. కోరోనాకు ఎఫెక్ట్ అయిన దేశాలన్నీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇండియాలో కూడా ఏప్రిల్ 14వరకూ లాక్ డౌన్ అయిపోయింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రధాని సూచన మేరకు ఎవరికి వారు ఇళ్లలో ఉండిపోయారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఇదే పరిస్థితి. నీతూ చంద్ర కూడా తన పరిస్థితిని వివరిస్తూ ఈ విపత్కర సమయంలో ఎలా ఉండాలో చెప్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Requesting everyone to be at #Home 🙏 घर पर रहिये, बिलकुल बंद! #familytime #safetyfirst #worldfights #coronavirüsü 🙏

A post shared by Neetu N Chandra (@neetunchandra) on

మరింత సమాచారం తెలుసుకోండి: