ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి దేశంలో కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ అమెరికా, ఇటలీ, చైనా, జర్మనీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దేశంలో ఒక మారణకాండ జరుగుతుందని చెప్పవచ్చు. అయితే దీనిని అరికట్టేందుకు ఆయా ప్రభుత్వాలు వారి శక్తికి మించి ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ కొంతమంది ఇవన్నీ లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నారు.


అయితే ప్రస్తుతం భారతదేశంలో మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్న విషయాన్ని భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల క్రితం తెలిపారు. ఇది కూడా మన కోసమే అని గ్రహిస్తే మంచిది. అయితే ఇవన్నీ పక్కన పెడితే లాక్ డౌన్ తో ఎవరి ఇళ్లలో వారు జీవనం ప్రశాంతంగా సాగిస్తున్నారు. అయితే మన కోసం రోడ్లమీద పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు అలాగే హాస్పిటల్స్ లో వైద్యులు కరోనా వైరస్ ని  అరికట్టేందుకు వారి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

 


అయితే ఈ విషయాన్ని గూర్చి టాలీవుడ్ సూపర్ సార్ ప్రిన్స్ మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా పారిశుద్ధ్య కార్మికులను ఆయన అభినందించడం జరిగింది. ఆయన ట్విట్టర్ లో వారి గురించి మనమందరము ఇంట్లో ఉండగా వారు మన ప్రాణాలను కాపాడటానికి వారి ప్రాణాలు లెక్కచేయకుండా మన ఇంటి చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి వారు ప్రయత్నిస్తున్నారు వారికి ధన్యవాదాలు అంటూ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఏదిఏమైనా పారిశుద్ధ కార్మికులు పోలీసులు డాక్టర్లు కరోనా వైరస్ అభివృద్ధి చెందకుండా మనకోసం వారు నిరంతర శ్రమ జీవి గా పని చేస్తున్నారు. కాబట్టి వారికి తగినంత తోడుగా మనం నిలుద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: