మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ముందుగా 2007లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న చరణ్, ఆ తరువాత రాజమౌళి తీసిన మగధీరతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇక అక్కడి నుండి ఒక్కొక్కటిగా సినిమాలతో మెల్లగా తన క్రేజ్ ని పెంచుకుంటూ ముందుకు సాగిన చరణ్, ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ లో ఒక హీరోగా నటిస్తున్నారు. ఇక తన చిన్ననాటి స్నేహితురాలైన ఉపాసన కామినేనిని 14 జూన్ 2012న చరణ్ వివాహం చేసుకోవడం జరిగింది. చరణ్ ఇష్టాన్ని మేమెప్పుడూ కాదనలేదు, అలానే ఉపాసన వాళ్ళ ఫ్యామిలీ తో మాకు మొదటి నుండి మంచి అనుబంధం ఉందని మెగాస్టార్ అప్పట్లో తెల్పడం జరిగింది. 

 

అయితే మెగా ఇంట కోడలు అడుగుపెట్టిన తరువాత రామ్ చరణ్ నడవడికలో కూడా కొంచం మంచి మార్పులు వచ్చినట్లు ఇటీవల మెగాస్టార్ దంపతులు చెప్పడం జరిగింది. పెళ్ళైన తరువాత చరణ్ కు బాగా బాధ్యతలు తెలిసివచ్చాయని, అలానే మరోవైపు బిజినెస్ లో కూడా మంచి అనుభవం ఉన్న ఉపాసన, చరణ్ తో పాటు అందరితోనూ అన్ని విధాలా తోడు నీడగా ఉంటుందని వారిద్దరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఇక ఎప్పుడూ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన భర్త సినిమాలు, తమ ఫ్యామిలీ గురించిన విషయాలు అభిమానులతో షేర్ చేసుకునే అలవాటున్న ఉపాసన, ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి అందరికీ ఉపయోగపడే పలు మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. 

 

ఇక ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం గల ఉపాసన, గతంలో పలు సామజిక కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. మన దేశంలో ఎక్కువగా వెస్ట్రెన్ టాయిలెట్స్ ని వాడుతున్నారని, దానివలన మనకు కొంత శారీరక సమస్యలు వస్తున్నాయని, అదే కనుక పాత పద్దతిలో ఉండే బేసిన్ టాయిలెట్ ని వాడడం, అలానే ఆ విధంగా కొన్ని నిమిషాలపాటు కూర్చుకోవడం వలన మన శరీరానికి ఎంతో మంచిదని, ఆ భంగిమలో తాను కూర్చుని ఉన్న ఒక ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు ఉపాసన. అయితే ఉపాసన పెట్టిన ఆ పోస్ట్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ రోజుల్లో అటువంటివి మాట్లాడడం అంటేనే ఇష్టపడని ఎందరో ఉన్న ఈ సమాజంలో, మీరు ఎంతో ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ ఏ మాత్రం బిడియం లేకుండా ఈ విధంగా మీవంతుగా సమాజానికి మెసేజ్ ఇస్తున్న మీ డేరింగ్ కి నిజంగారెండు చేతులెత్తి మొక్కినా తక్కువే మేడమ్ అంటూ ప్రశంసిస్తూ పలువురు నెటిజన్లు ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు.....!!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Looks so easy but so tough to sit in this position for loads of people living in the city. Can u sit in the indian toilet position for 5 min ? Remember ur full foot 🦶 has to be on the ground. By may 3rd i want to be able to do it ! #quarantinegoal Swipe up from my stories to read the health benefits of sitting in this position. @urlife.co.in

A post shared by upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on

మరింత సమాచారం తెలుసుకోండి: