కరోనా  వైరస్ ను  కట్టడి  చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్  చాలామంది పాలిట శాపంగా మారుతోంది. ఏదో ఒక ఉపాధి కోసం  పొట్టకూటి కోసం ఊరు కాని ఊరు రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి ...పని  చేసుకోవడానికి వచ్చిన వారు ప్రస్తుతం లాక్ డౌన్  నేపథ్యంలో ఎలాంటి పనులు లేక కనీసం తినడానికి తిండి  కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే ఉపాధి పనులు దొరికి  అప్పుడైనా కాస్త ఆనందం గా ఉండవచ్చు అని అనుకున్న ప్రజలకు మరోసారి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడగిగించడంతో నిరాశ ఎదురైంది. దీంతో కనీసం పొట్టకూటి కోసం ఎలాంటి డబ్బులు లేకపోతే సొంత గ్రామాలకు పయనమవుతున్నారు. 

 

 

 ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ మొత్తం ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో చేసేదేమీ లేక కాలినడకనే సొంత ఊర్లకు చేరుకుంటున్నారు వందల కిలోమీటర్లు నడిచి సొంత ఊర్లకు చేరుకుంటున్న వాళ్ళు కొంతమంది అయితే సొంత ఊర్లకు చేరుకోవాలని ఆశతో బయలుదేరి మధ్యలోనే ప్రాణాలు విడుస్తున్న వారు  ఇంకొంతమంది. ఇలాంటి విషాదకర ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి చత్తిస్ ఘడ్ కి  మూడు రోజుల పాటు కాలినడకన వెళ్లి రెండేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. 150 కిలోమీటర్లు నడిచిన బాలిక ఇంటికి 14 కిలోమీటర్ల దూరంలో మృత్యువాత పడింది. ఈ విషాదకర ఘటన ఎంతో మందిని కలిచి వేసింది. 

 

 

 అందోరం మఖ్డం, సుఖమతి దంపతులకు జామ్లో మోక్డం   అనే ఒక కూతురు ఉంది. తెలంగాణ లోని  గ్రామానికి రెండు నెలల క్రితం కుటుంబ ఉపాధి కోసం వచ్చారు. మిర్చి  పనులకు వచ్చిన వీరు లాక్ డౌన్  కారణంగా ఇక్కడ ఇరుక్కుపోయారు. రవాణా వ్యవస్థ ఏది అందుబాటులో లేకపోవడంతో కాలినడకన ఇంటికి వెళ్లాలి అని భావించే కాలి నడక ప్రారంభించారు ఈ క్రమంలోనే బీజాపూర్ జిల్లా సరిహద్దుకు చేరుకోగానే జామ్లో కి  కడుపునొప్పి వచ్చి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది . పరిస్థితి విషమించడంతో గ్రామస్తుల సాయంతో స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. అక్కడి నుంచి వారిని క్వారంటైన్  కు తరలించారు అధికారులు. పోషకాహార లోపం డిహైడ్రాషమ్  కారణంగానే సదరు బాలిక చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: