పవన్ కళ్యాణ్ క్రిష్ ల కాంబినేషన్ లో ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన మూవీకి ‘విరూపాక్ష’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇప్పటికే మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ  టైటిల్ కు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ఇప్పడు బయటకు వచ్చింది. ఈ  టైటిల్ ను క్రిష్ రిజిస్టర్ చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ ఈ టైటిల్ పవన్ మూవీకి సంబంధించింది కాదనీ వాస్తవానికి ఈ టైటిల్ పవన్ కు పెద్దగా నచ్చలేదు అన్న వార్తలు వస్తున్నాయి.


దీనితో ఈ సినిమాకు మరొక టైటిల్ ఆలోచించే పనిలో క్రిష్ ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే ఈ మూవీ కథలో ఒక తుగ్లక్ రాజు లాంటి క్యారెక్టర్ ఉంటుందని ఆ క్యారెక్టర్ ప్రస్తుతం రాజకీయాలలో ఒక కీలక పదవిలో ఉన్న వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని క్రిష్ ఆ పాత్ర అల్లాడనీ ఆ పాత్ర ఫై చాల పొలిటికల్ సెటైర్ల డైలాగ్స్ క్రిష్ క్రియేట్ చేసినా అలాంటి కాంట్రావర్సీల జోలికి వెళ్ళవద్దని క్రిష్ కు పవన్ సూచనలు ఇచ్చాడు అంటూ వార్తలు లీక్ అవుతున్నాయి. 


అంతేకాదు ఈ మూవీ కథను కేవలం ఒక రాబిన్ హుడ్ కథ లా ఉంచి పెద్ద‌లను కొట్టి పేదలకు పెట్టే ఒక దొంగ పాత్రగా మాత్రమే చూపించమని కాని ఆపాత్రకు ఎటువంటి రాజకీయ రంగులు అంటించ వద్దని పవన్ క్రిష్ కు స్పష్టంగా చెప్పాడు అని అంటున్నారు. దీనితో ఈ సినిమా కథలో పవన్ పాత్రను పేదల పెన్నిధిగా వీరుడిగా ప్రెజెంట్ చేయడం జరుగుతుంది కానీ ఎటువంటి పొలిటికల్ సెటైర్లు ఈ మూవీలో ఉండవని అంటున్నారు.  


మొఘ‌లాయిల కాలం నాటి క‌థ కావడంతో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా మార్చి భారీ సెట్టింగ్స్ గ్రాఫిక్స్ తో తీయాలని చేస్తున్న క్రిష్ ప్రయత్నాలకు కూడ పవన్ అడ్డు చెప్పినట్లు తెలుస్తోంది. కరోనా సమస్యల నుండి ఫిలిం ఇండస్ట్రీ ఇప్పట్లో తేరుకోవడం చాల కష్టం కాబట్టి అనవసరమైన అంచనాలతో ఈ మూవీ బడ్జెట్ ను పెంచి నిర్మాతలకు నష్టం కలిగించ వద్దు అంటూ పవన్ క్రిష్ కాళ్ళకు బంధాలు వేస్తూ ఈ మూవీ ప్రాజెక్ట్ ఖర్చు పెరగకుండా పవన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: