శ్రీ సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ తమన్నా .. ఆ సినిమా హిట్ అవ్వడంతో తెలుగు , తమిళ చిత్రాలలో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ వస్తుంది.. అతి పిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చిన ముద్దు గుమ్మ తమన్నా టాలెంట్ తో ఒక్కో అడుగు ఎక్కుతూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తోంది.. అంతేకాదండోయ్ తమన్నకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. 

 

 

 

 

చిన్న హీరో నుంచి పెద్ద హీరోల సరసన నటించిన తమన్నా వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. తమన్నా సినిమాల విషయానికొస్తే..శ్రీ సినిమా మొదలు హ్యాపీ డేస్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.. అలా సినిమా తర్వాత ఎన్నో సినిమాలలో నటించింది..చిత్ర పరిశ్రమలో ఒక సినిమా హిట్ అయితే ఆ హీరోయిన్ కు ఇంక లక్కు కలిసొచ్చిందనే చెప్పాలి..

 

 

 

 

 

ఇంక తమన్నా లాంటి పెద్ద హీరోయిన్ ల సంగతి ఇంక చెప్పాల్సిన పనిలేదు.. ఆమె అంతా తెల్లగా చిత్ర పరిశ్రమలో ఎవరు లేరు అన్న విషయం తెలిసిందే.. అందుకే ఆమెను మిల్క్ బ్యూటీ అనే పేరుతో పిలుస్తుంటారు..మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ , వెంకటేష్, నాగార్జున, నాగచైతన్య, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి టాక్ తో పాటుగా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. 

 

 

 

 

 

 

ఇకపోతే తమన్నా కు బాగా పేరు తెచ్చిన సినిమా అంటే అది బాహుబలి ఒక్కటే.. ఆ సినిమాతో దేశ విదేశాల్లో ఆమె పేరు సంపాదించుకుంది.. ప్రపంచ స్థాయి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.. ఆ సినిమా తర్వాత తెలుగులో వచ్చిన మరో సినిమా ఎఫ్2 వెంకటేష్ సరసన నటించిన తమ్ము ఈ సినిమా హిట్ అవ్వడంతో కుర్రకారు హృదయాలను మరో సారి గెలుచుకుంది . అందుకే ఈమె క్రేజ్ మరింత పెరిగింది.  ఇకపోతే అందానికి అభినయానికి ఎటువంటి కొదవ లేని తమన్నాకి తెలుగులో అవకాశాలు తగ్గాయి.. ప్రస్తుతం గోపీచంద్ సరసన సీటిమార్ సినిమాలో నటిస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: