ఈ మధ్య చిన్న హీరోలు అయినా పెద్ద హీరోలు అయినా సరే కథల్లో కాస్త కొత్తదనం కోరుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అభిమానులు ఇచ్చిన సలహాలను ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమకు కలిసి వచ్చినా లేకపోయినా సరే కొత్త కథలు, పాత్రలు అయితే తమకు ప్లస్ అవుతుంది అనే భావన లో వాళ్ళు ఉన్నారు అనేది అర్ధమవుతుంది. ఇక గ‌త కొంత కాలంగా టాలీవుడ్ లో కొత్త క‌థ‌ల‌తో తెర‌కెక్కిన సినిమా లు మంచి ఫ‌లితాన్ని అందుకుంటున్నాయి.

 

అసలు విషయం ఏంటీ అంటే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప‌ సినిమాలో హీరోయిన్ పాత్ర విషయంలో సోషల్ మీడియాలో ఒక అభిప్రాయం చూసాడట సుకుమార్. అది ఏంటీ అనేది చూస్తే హీరోయిన్ విషయంలో ఒక సంచలన పాత్ర ఉండే విధంగా సూచించారట కొందరు ప్రేక్షకులు, అభిమానులు. హీరోయిన్ ని అడవిలో రేప్ అయ్యే అమ్మాయిగా చూపించాలి అని ...!

 

దారి తప్పి అడవిలోకి వెళ్ళిన హీరో... హీరోయిన్ రేప్ ని చూసి కాపాడి... ఆ తర్వాత ఆమె మీద రేప్ చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకుని వాళ్ళను చంపే విధంగా వాళ్ళతో కలిసి చంపే విధంగా ఉంటే బాగుంటుంది అని, అందులో హీరో హీరోయిన్ కి ఇద్దరికీ పెళ్లి అవ్వాలని... అప్పుడు సినిమాకు ఒక కిక్ వస్తుంది అనే సలహాను ఇచ్చారట. దీంతో సుకుమార్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింద‌ట‌. దీనిని బ‌ట్టి ఫ్యాన్స్ ఆలోచ‌న‌లు ఎంత దారుణంగా ఉంటున్నాయో ?  అర్థం చేసుకోవ‌చ్చు.

 

ఇక ఈ సినిమాలో బ‌న్నీ ఓ శేషాచ‌లం అడ‌వుల్లో గంధ‌పు చెక్క‌ల‌ను స్మ‌గ్లింగ్ చేసే టీం లో లారీ డ్రైవ‌ర్ గా న‌టిస్తున్నాడ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. సినిమా లుక్ చూస్తుంటే బ‌న్నీ ఊర‌మాస్ యాంగిల్లో ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: