సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో చాలామంది స్టార్ హీరోయిన్గా ఎదుగుతారని అందరూ అనుకున్నప్పటికీ.. హీరోయిన్ లూ  మాత్రం తక్కువ సమయంలోనే చిత్ర పరిశ్రమలో కనుమరుగైపోతు ఉంటారు. ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించినప్పటికీ ఆ తర్వాత మాత్రం... ఎక్కడ తెరమీద కనిపించకుండా పోతారు. ఇలా మొదట్లో ఎంతగానో గుర్తింపు సంపాదించిన స్నేహ ఉల్లాల్ ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో కనుమరుగైపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ తెరమీద కూడా కనిపించడం లేదు ఈ ముద్దుగుమ్మ.... 

 

 

 అయితే ఈ అమ్మడి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈ అమ్మడు పిల్లి కళ్ళు అందం చూసి మరో ఐశ్వర్యరాయ్ అవుతుంది అని అనుకున్నారు. ఐశ్వర్యరాయ్ రేంజిలో క్రేజ్ సంపాదించి చిత్ర పరిశ్రమను ఏలుతుంది అని అనుకున్నారు. కానీ స్నేహ ఉల్లాల్ మాత్రం అంతగా రాణించలేక పోయింది. కరెంట్ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నేహ ఉల్లాల్ ఆ తర్వాత బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టేసింది. కానీ ఇవన్నీ ఈ అమ్మడు కెరీర్ కి మాత్రం ఏ మాత్రం ఉపయోగపడలేదు. దర్శకనిర్మాతలు స్నేహ ఉల్లాల్ వైపు అసలు ఇంట్రస్ట్ చూపలేదు. 

 

 

 దీంతో స్నేహ ఉల్లాల్ క్రమక్రమంగా అవకాశాలు కరువయ్యాయి. ఒకవేళ అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ అవి కాస్త ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాయి. దీంతో కొత్త క్రేజ్ దేవుడెరుగు ఉన్న క్రేజ్ కూడా పోయింది. ఆ తర్వాత పూర్తిగా అవకాశాలు కరువవడంతో చిత్ర పరిశ్రమలు కనుమరుగైపోయింది ఈ హీరోయిన్. మొదట్లో జూనియర్ ఐశ్వర్యారాయ్ అంటూ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించి  మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నేహ ఉల్లాల్ ఆ తర్వాత మాత్రం అసలు అడ్రస్ లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: