టాలీవుడ్ లో అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు ఒక్క అవకాశం వచ్చినా చాలు అనుకుంటుంది ఇలియానా. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు మాత్రం ఒక్క అవకాశం కూడా లేకుండా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలను చేసిన ఆమెకు ఇప్పుడు ఒక్క ఛాన్స్ కూడా రావడం లేదు. టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు ఇచ్చే వాళ్ళు కూడా లేరు అనే చెప్పాలి. ఇక్క‌డ వ‌రుస‌గా స్టార్ హీరోల‌తో ఛాన్సుల మీద ఛాన్సులు ద‌క్కించు కుంటూ సూప‌ర్ హిట్లు కొడుతూ టాలీవుడ్ ను ఏలుతోన్న వేళ ఆమె వేసిన రాంగ్ స్టెప్ ఆమె కెరీర్ ను స‌ర్వ‌నాశ‌నం చేసింది.

 

ఓ వైపు ఆస్ట్రేలియ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్ ఆండ్రూ తో ప్రేమాయ‌ణం.. ఇటు బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి పోవాల‌ని టాలీవుడ్ కెరీర్‌ను వ‌దులు కోవ‌డ‌మే ఆమె చేసిన రాంగ్ స్టెప్‌. ఆ త‌ర్వాత ఆమె తిరిగి ఇక్క‌డ‌కు వ‌చ్చినా అప్ప‌టికే ఆమెను ప‌ట్టించుకోవ‌డం మానేశారు. కొత్త హీరోయిన్ల ఎంట్రీతో ఇల్లూ బేబీ వెన‌క ప‌డిపోయింది. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతుంది అని సమాచారం. దీనితో ఆమె టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసి చేసి.. ఇక రావు అని భావించి ఇప్పుడు న్యూస్ యాంకర్ గా మారాలి అని భావిస్తున్నట్టు సమాచారం.

 

ఒక జాతీయ ఛానల్ లో ఆమె న్యూస్ యాంకర్ గా పని చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. మరి ఆమె చేస్తుందో లేదో చూడాలి. ఇక ఆమెను న్యూస్ యాంకర్ గా మారమని సలహా ఇచ్చింది ఒక స్టార్ హీరో అని సమాచారం. ఇప్పుడు అంతా కొత్త వారి హవా ఉందని దానిని తట్టుకుని నిలబడటం చాలా కష్టం కాబట్టి ఇపుడు వేరే మార్గాలను ఆదాయం కింద చూసుకుంటే చాలా మంచిది అని ఆమెకు చెప్పినట్టు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: