నిన్న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన మహేష్ పరుశు రామ్ ల కొత్త మూవీ ‘సర్కార్ వారి పాట’ ఫస్ట్ లుక్ పోష్టర్ కు విపరీతమైన స్పందన వచ్చింది. వాస్తవానికి నిన్న ఈమూవీ ప్రారంభోత్సవాన్ని కొంతమంది అతిధుల మధ్య పూజ కార్యక్రమాలతో చేయాలని ఈమూవీ నిర్మాతలు భావించినా ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా పరిస్థితులు వల్ల ఎటువంటి చిన్న గెట్ టు గెదర్ లు కూడ వద్దని కేవలం ఈసినిమాకు సంబంధించిన పోష్టర్ డిజిటల్ లాంచింగ్ తో సరిపెడదామని మహేష్ ఈమూవీ నిర్మాతలు మైత్రీ మూవీస్ మేకర్స్ ను ఒప్పించినట్లు తెలుస్తోంది.


వాస్తవానికి మహేష్ కొత్త సినిమా టైటిల్ పోష్టర్ లాంచ్ ని అభిమానుల మధ్య కుదరకపోయినా ఒకప్రముఖ ఛానల్ లో ఈకార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ గా ప్రసారం చేద్దామని ఈమూవీ నిర్మాతలు భావిస్తే ప్రస్తుత పరిస్థితులలో అనవసరపు ఖర్చులు వద్దు అంటూ మహేష్ ఆప్రయత్నాన్ని కూడ విరమింప చేసాడని టాక్. దీనితో కరోనా సమస్యలు తరువాత టాప్ హీరోల సినిమాలకు సంబంధించి ఎలాంటి పొదుపు చర్యలు పాటించవలసి వస్తుందో మహేష్ తన కొత్త మూవీ పోష్టర్ లాంచ్ ని డిజిటల్ లాంచ్ గా మార్చి టాప్ హీరోలకు తమ సినిమాల ఖర్చులు తగ్గించుకోవలసిన అవసరం ఉంది అన్నవిషయం పరోక్షంగా మహేష్ తెలియచేసాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.  


నిన్న విడుదలైన ఈసినిమా టైటిల్ పోస్టర్ లో మహేష్ పూర్తి లుక్ మాత్రం రివీల్ చేయకపోవడం వెనుక టాప్ సీక్రెట్ ఉంది అన్నప్రచారం జరుగుతోంది. ఈమూవీలో మహేష్ మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తాడని నిన్నవిడుదలైన పోష్టర్ లోని మహేష్ లుక్ ఆమూడు లుక్స్ లో ఒకటి అని అంటున్నారు. రఫ్ గా కనిపించేలా గడ్డం బ్లాక్ షర్ట్  హై హెయిర్ స్టైల్ తో మాసీగా కనిపిస్తున్నాడు. వీటన్నిటికీ మించి టైటిల్ కు సంబంధించిన సీక్రెట్ ను రేఖా మాత్రంగా అందరికీ తెలియపరిచే విధంగా మహేష్ మెడ పై రూపాయి కాయిన్ టాటూ వేయడం వెనుక వేల కోట్లల్లో బ్యాంక్ లలో స్కామ్ లు చేస్తూ విదేశాలకు పారిపోతున్న బడా బాబులను పట్టుకుని హీరో పాత్రలో మహేష్ నటిస్తున్నాడు అన్న సంకేతాలు పరుశు రామ్ ఈపోష్టర్ ద్వారా ఇచ్చాడు అని అంటున్నారు.


ఈమూవీలో మహేష్ తల్లి ఒక బ్యాంక్ కు సంబంధించిన ఉన్నత అధికారి అని తెలుస్తోంది. అయితే ఒక బడా పారిశ్రామిక వేత్త కొన్ని వేల కోట్లల్లో చేసిన భారీ బ్యాంక్ స్కామ్ లో ఆమె అనుకోకుండా చిక్కుకుంటుంది. అనవసరంగా ఈస్కామ్ తో అపవాదులు పడిన తన తల్లిని ఎలా కాపాడాడు అన్న మదర్ సెంటిమెంట్ తో కూడిన రివెంజ్ స్టోరీ ఇది అని అంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: