బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్  రోషన్ కి  ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా హృతిక్ రోషన్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు. బాలీవుడ్ లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా హృతిక్ రోషన్ యాక్షన్ ఎలిమెంట్స్ కి ఫిదా అవని సినీ ప్రేక్షకుడు లేడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక బాలీవుడ్ గ్రీక్ గాడ్ గా హృతిక్ రోషన్ కి మంచి గుర్తింపు. హృతిక్ రోషన్ ని ఒక్కసారి చూస్తే చాలు అనుకునే సినీ ప్రేక్షకులు ఎంతో మంది. అమ్మాయిల్లో  అయితే హృతిక్ రోషన్ కి తెగ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న హృతిక్ రోషన్ సంపాదన కూడా భారీ రేంజ్ లోనే ఉంటుంది అన్న విషయం తెలిసింది. 

 


 అయితే ప్రస్తుతం హృతిక్ రోషన్ బాలీవుడ్ లోనే కాదు క్రిష్ సినిమా తో దక్షిణాది ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయ్యారు. ఇక ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తూ హృతిక్ రోషన్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటూ ఉంటాడు. ఇక ఫిట్నెస్ విషయంలో అయితే హృతిక్ రోషన్ ఎంత ఖచ్చితత్వంతో ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రస్తుతం భారత చిత్ర పరిశ్రమ లో  అతి ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వారి జాబితాలో మొదటి స్థానంలో ఉంటారు హృతిక్ రోషన్ . ఇక ఆయన సంపాదన కూడా భారీగానే ఉంటుంది. కాగా  హృతిక్ రోషన్ ఆరేళ్ల వయసులోనే ఆశా సినిమాలో  బాల నటుడిగా కనిపించారు. 

 

 


 అయితే 1980 లో వచ్చిన ఈ చిత్రం లో బాలనటుడిగా నటించినందుకు గాను హృతిక్ రోషన్ పారితోషికంగా వంద రూపాయలు ఇచ్చారట. ఇక ఈ సినిమా తర్వాత కూడా పలు సినిమాల్లో బాల నటుడిగా నటించి మెప్పించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వచ్చిన కహోనా  ప్యార్  హై  సినిమాతో హీరోగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆరంగేట్రం చేశారు. సినిమా నుంచి యువతను  ఎక్కువగా ఆకర్షించే విధంగా తనదైన నటనతో యాక్షన్ తో అదరగొడుతూ వచ్చారు హృతిక్ . తన సినిమాలతో ఎన్నో సంచలన విజయాలు సాధించి స్టార్ హీరో గా మారిపోయారు . హృతిక్ రోషన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: