సినిమా వాళ్ళ కష్టాలు తెర మీద ఉన్న రంగులతో కనపడవు అని అంటూ ఉంటారు. వాళ్ళ కష్టాలను చూసే వాడు..  వాళ్ళ కష్టాలను అడిగే వాడు పెద్దగా ఎవరూ ఉండరు అనేది అందరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అందంగా రావడానికి ఎంత కష్టపడాలో సినిమా అందంగా ప్రేక్షకులకు కనపడకపోతే దాని ప్రభావం కూడా ఎదుర్కోవడానికి దర్శక , నిర్మాతలు అన్ని విధాలుగా సిద్దంగా ఉండాలి. 

 

మనకు వాళ్ళు అందించే సినిమానే కనపడుతుంది గాని వాళ్ళు పడే కష్టం  పెద్దగా కనపడదు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టాలీవుడ్ లో ఒక పెద్ద నిర్మాత అప్పుల పాలు అయిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సదరు నిర్మాతసినిమా కోసం భారీగా ఖర్చు చేసి ఇప్పుడు వడ్డీలు కట్టలేక ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అర్ధం కాక నరకం చూస్తున్నాడు. అటు ఫైనాన్షియ‌ర్ల నుంచి వ‌స్తోన్న ఒత్తిడి ఆ నిర్మాత‌పై ఎక్కువుగా ఉంద‌ట‌.

 

ఎవరిని నిలదీసి అడగలేని పరిస్థితి... ఎవరిని ఆదుకోండి అని అడగలేని దుస్థితి... నా మొహం చూడండి అని ఎవరికి కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఆ నిర్మాతను ఆదుకోవడానికి సినిమా చేస్తున్న దర్శకుడు కూడా కనికరం చూపించడం లేదు అని కొన్ని సన్నివేశాలను రీ షూట్ చెయ్యాలి అని చెప్తున్నాడు అని టాలీవుడ్ లో ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఆ నిర్మాత ఆత్మహత్య చేసుకునే వరకు పరిస్థితులు వెళ్ళాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: