మెగా బ్రదర్ నాగబాబు కూతురైనా కొణిదెల నిహారిక తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టి ఒకరికి భార్యని అవుతున్నానంటూ అకస్మాత్తుగా వెల్లడించగా... అందరూ ఒకేసారి ఆశ్చర్యపోయారు. ఆ మరుసటి రోజే తన కాబోయే భర్తతో కలిసి దిగిన ఫోటో ని ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి అందరికి ఝలక్ ఇచ్చింది. రెండు రోజుల క్రితం అబ్బాయి ఫోటో అందరికీ చాలా క్లారిటీ గా కనిపించేలా తన ఖాతాలో పోస్ట్ పెట్టింది నిహారిక. కాగా, నిహారిక ని పెళ్లి చేసుకునేది గుంటూరు జిల్లాకు చెందిన చైతన్య జొన్నలగడ్డ తెలిసింది. 

IHG
అతడు ఐజి ప్రభాకర్ రావు కుమారుడని,  మెగా కుటుంబంతో ఎప్పటినుండో సాన్నిహిత్యంగా ఉంటున్నారని సమాచారం. చైతన్య జొన్నలగడ్డ బిట్స్ పిలానీలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అయితే నిహారిక కి చైతన్య జొన్నలగడ్డ అంటే చాలా ఇష్టమట అందుకే నాగబాబు తన కూతురు ఇష్టపడిన అబ్బాయి ని కాదనలేక అతడితో ఆమె పెళ్లికి అంగీకరించినట్టు తెలుస్తోంది. పెళ్లి పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి అని సమాచారం. అయితే నిహారిక పెళ్లి విషయంలో పవన్ కళ్యాణ్ ఎక్కువ శ్రద్ధ తీసుకొని చైతన్య ను బాగా స్టడీ చేసి... ఆపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత నాగబాబు ముందడుగు వేశాడని తెలుస్తుంది. 

IHG
అప్పటికే ప్రభాకర్ రావు కుటుంబంతో సాన్నిహిత్యంగా మెలిగే నాగబాబు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత నిహారిక కు అతడితోనే పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. ఐతే 2017 వ సంవత్సరం నుండి నిహారిక, చైతన్య ప్రేమించుకుంటున్నారని ఈ ఏడాది వేసవికాలంలో పెళ్లి చేయాలని నాగబాబు అనుకున్నాడు అని తెలుస్తుంది. కానీ లాక్ డౌన్ కారణంగా వారి పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా తమ కుటుంబ సభ్యుల పెళ్లి విషయాలలో చిరంజీవి ఎక్కువగా చొరవ తీసుకుంటారు కానీ ఈసారి పవన్ కళ్యాణ్ నిహారిక పెళ్లి విషయంలో కీలకమైన పాత్ర వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: