టాలీవుడ్ యువ దర్శకుడు శేఖర్ కమ్ముల ముందుగా డాలర్ డ్రీమ్స్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆనంద్, గోదావరి తదితర సినిమాలు తీసిన శేఖర్ కమ్ముల, అనంతరం హ్యాపీ డేస్ సినిమా సూపర్ డూపర్ హిట్ తో దర్శకుడిగా మరింత గొప్ప ఖ్యాతిని గడించారు. ఇక ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల, ఆవకాయ బిర్యానీ సినిమా తీయగా అది పెద్ద సక్సెస్ కాలేదు, అనంతరం దగ్గుబాటి వారి వారసుడు రానా దగ్గుబాటిని హీరోగా లాంచ్ చేస్తూ లీడర్ సినిమాని శేఖర్ తీయడం జరిగింది. 

IHG

అప్పటి రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, అలానే రాజకీయాల్లో ఎటువంటి కుట్రలు కుతంత్రాలు ఉంటాయి, ఎలాంటి రాజకీయం చేయాలి, ప్రజలకు ఎటువంటి లీడర్ కావాలి, అతడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి వంటి తదితర అంశాల మేళవింపుగా శేఖర్ తీసిన లీడర్ సినిమా మంచి సక్సెస్ ని అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంశలు కూడా అందుకుంది. రానా తన ఆకట్టుకునే నటనతో ముఖ్యమంత్రిగా ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్ హీరోయిన్స్ గా నటించడం జరిగింది. తండ్రి మరణం తరువాత కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆయన కోరిక మేరకు సీఎం గా పీఠాన్ని అధిష్టించిన ఒక యువకుడు, ఆ తరువాత తన చుట్టూ ఉన్న కుట్రదారులు, వారి పన్నాగాలు ఎప్పటికప్పుడు పసిగట్టడంతో పాటు, ప్రజలకు నిస్వార్థమైన సేవలు అందించడం కోసం కొన్నాళ్ళకు తన సీఎం పదవికి రాజీనామా చేస్తాడు. 

 

అనంతరం చివరకు ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు, వారి పరిస్థితులు తెలుసుకుని రాజకీయం చేయడానికి సిద్ధం అవుతాడు. ఆ విధంగా ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాని తెరకెక్కించిన తీరు ఎంతో బాగుంటుంది. కాగా కాగా ఈ లీడర్ సినిమా అప్పట్లో రాజకీయ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల్లో మంచి బెంచ్ మార్క్ సినిమాగా నిలిచిందని చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: