యాంకర్ శ్రీముఖి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అదుర్స్ అనే కార్యక్రమంతో యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీముఖి.. 2012 లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెరపై ప్రవేశించింది. తర్వాత పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో హీరోయిన్ కూడా అయ్యింది.
అంతేకాకుండా.. నేను శైలజ సినిమాలో హీరో రామ్ కు సోదరిగా నటించి మెప్పించింది. అలాగే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ధనలక్ష్మి తలుపు తడితే, సావిత్రి వంటి సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసింది. అయితే ఈ అమ్మడుకు వెండితెర కన్నా బుల్లితెరపైనే బాగా కలిసొచ్చింది.. క్రేజ్ తీసుకొచ్చింది. తను హోస్ట్ చేసే షోలలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో యూత్ ని బాగా అట్రాక్ట్ చూస్తూ ఉంటుంది.
స్మాల్ స్క్రీన్ రాములమ్మగా పాపులర్ అయిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ షోలోనూ పాల్గొంది. ఈ షో చివరకు వరకు నిలిచి రన్నరప్ తో సరిపెట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చిన తరువాత శ్రీముఖి క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతోంది. మరోవైపు హాట్ హాట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో పెడుతూ కుర్రాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. తాజాగా కూడా ఈ మత్తెక్కించే ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.