టాలీవుడ్ చందమామ కాజల్ పైకి చూసి చాలా సెన్సిటివ్ అనుకుంటాం కాని అమ్మడు చూడటానికే అలా ఉంటుంది కాని లోపల గడుసుతనమే ఉన్నట్టు తెలుస్తుంది. అదెలా అంటారా ఇన్నేళ్ల కెరియర్ లో మీ బలహీనతలు.. సవాళ్లను మీరు ఎలా వీకరించారు అంటే.. ప్రతి సమస్య ఓ సవాల్ గా తీసుకుంటా అంతేకాని వాటిని బలహీనతలుగా మార్చుకోనని చెబుతుంది కాజల్. ఇన్నాళ్ల కెరియర్ లో వృత్తిపరంగా మీరు వదులుకోలేకపోయి.. అడ్డంగా అనిపించిన బలహీనతలు ఉన్నాయా అంటే కాజల్ పైన చెప్పిన విధంగా ఎప్పుడైనా సరే ఎదురయ్యే సమస్య నుండి పారిపోవాలని చూస్తే అది చిన్నగా మన బలహీనతగా మారుతుందని.. అలాంటి స్థితిలో ఉండాలని తాను ఎప్పుడు కోరుకోనని అంటుంది కాజల్.

 

హీరోయిన్ గా తెర మీద చాలా అందంగా కనిపిస్తాం కాని షూటింగ్ టైం లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వివేగం సినిమా టైంలో మైనస్ 12 డిగ్రీస్ చలిలో చీరకట్టుకుని నటించా.. అది తెర మీద చూసుకున్నప్పుడు బాగుంటుంది కాని దానికి పడిన కష్టం తన ఒక్కదానికే తెలుసని చెప్పుకొచ్చింది కాజల్. మొత్తానికి కాజల్ చూస్తే సెన్సిటివ్ గా ఉంటుంది కదా ఎలా నెట్టుకొస్తుందో అనుకున్నాం కాని అమ్మడు తనకు ఎదురయ్యే సమస్యలను కూడా సవాల్ గా స్వీకరించి వాటిపై పోరాడుతుందని తెలుస్తుంది.

 

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో పాటుగా కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2 సినిమాలో కూడా నటిస్తుంది కాజల్. రెండు మూడేళ్ల క్రిందట ఫాం కోల్పోయినట్టు కనిపించిన అమ్మడు మళ్లీ ఇప్పుడు వరుస అవకాశాలను అందుకుంటుంది. సీనియర్ హీరోలకు ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ గా మారిన కాజల్ అలాంటి ఛాన్సులు వస్తే తప్పకుండా ఓకే చేస్తుంది. అందుకు తగిన రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేస్తుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: